Sunday, September 12, 2010

మల్లమ్మ కథ--1973






సంగీతం::S.P.కోదండపాణి
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి

పల్లవి::

హేయ్..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ..హోయ్
తొలివాన కురిసిందీ..తొలకరి వచ్చిందీ
చెందించి మా కోడె..చేలోకి మళ్ళిందీ
ముల్లుగర్ర పట్టరా..ముందడుగు వెయ్యరా
హేయ్..ముల్లుగర్ర పట్టరా..ముందడుగు వెయ్యరా
ఒళ్ళొంచి పాటు చెయ్యరా..ఓరన్న
తిండికి దిగులు లేదురా..ఓరన్న 
తిండికి దిగులు..లేదురా..ఆ ఆ ఆ హయ్ 

చరణం::1

హోయ్..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..హయ్
యాతాము ఎక్కరా..ఎదురు నడిచి తొక్కరా
నీటికి అడ్డమేసి..తోటలన్నీ తడపరా..మ్మ్
యాతాము ఎక్కరా..ఎదురు నడిచి తొక్కరా
నీటికి అడ్డమేసి..తోటలన్నీ తడపరా
నల్ల బంగారాన్నీ..నమ్ముకున్నామురా
చల్లని భూదేవి..చెయ్యందిస్తుందిరా 
  
తొలివాన కురిసిందీ..తొలకరి వచ్చిందీ
చెందించి మా కోడె..చేలోకి మళ్ళిందీ
ముల్లుగర్ర పట్టరా..ముందడుగు వెయ్యరా
హేయ్..ముల్లుగర్ర పట్టరా..ముందడుగు వెయ్యరా
ఒళ్ళొంచి పాటు చెయ్యరా..ఓరన్న
తిండికి దిగులు లేదురా..ఓరన్న 
తిండికి దిగులు..లేదురా..ఆ ఆ ఆ హేయ్

చరణం::2

లాలా లలలాలాలలలాలాలా హేయ్ హేయ్
పెరిగిన వరిపైరూ..ఒరిగి విరగ పడాలీ
బలిసిన ఎల్లావులు..పాలుచేసి పిండాలీ..మ్మ్
పెరిగిన వరిపైరూ..ఒరిగి విరగ పడాలీ
బలిసిన ఎల్లావులు..పాలుచేసి పిండాలీ
ఇంటెల్లపాదిగూడ..నెయ్యన్నం తినాలీ
చీకటి బతుకుల్లో..సిరివెన్నెల కాయాలీ
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ..హోయ్    
తొలివాన కురిసిందీ..తొలకరి వచ్చిందీ
చెందించి మా కోడె..చేలోకి మళ్ళిందీ
ముల్లుగర్ర పట్టరా..ముందడుగు వెయ్యరా
హేయ్..ముల్లుగర్ర పట్టరా..ముందడుగు వెయ్యరా
ఒళ్ళొంచి పాటు చెయ్యరా..ఓరన్న
తిండికి దిగులు లేదురా..ఓరన్న 
తిండికి దిగులు..లేదురా..ఆ ఆ ఆ హేయ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హేయ్ హేయ్ 

No comments: