Showing posts with label మీనా--1973. Show all posts
Showing posts with label మీనా--1973. Show all posts

Sunday, September 12, 2010

మీనా--1973



















సంగీతం::రమేష్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
Director::Vijayanirmala 
తారాగణం::కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,చంద్రమోహన్,S.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ


శ్రీ భద్రాచలధామా రఘుకుల క్షీరాంబుధిసోమా 
శ్రీ భద్రాచలధామా రఘుకుల క్షీరాంబుధిసోమా 
అయ్యా ఆంధ్రజాతికే..గర్వకారణం రాణీరుద్రమ్మా..తంధానతాన 
పట్టం గట్టుక రుద్రమదేవి..పరిపాలిస్తుంటే..తంధానతాన
మీసంపెంచిన మగరాయుళ్ళే..దాసులు అయినారు..తంధానతాన
కొమ్ములు తిరిగిన మొనగాళ్ళంతా..గులాములయినారు..తంధానతాన 
అయ్యో గిట్టనివాళ్ళు కొందరుమాత్రం కుట్రలు పన్నారు..తంధానతాన 
మురారినాయుడు ద్రోహులలోన ముఖ్యమైనవాడు..తంధానతాన
రుద్రమదేవిని హత్యచేయ ఆ క్షుద్రుడు తలచాడు..తంధానతాన
శ్రీ భద్రాచలధామా రఘుకుల క్షీరాంబుధిసోమా ఆయ్త రికిట తం చరిత

ఆ క్షుద్రుని తలంపు ఫలించడానిక అన్నట్లు ఆ మొగిలిచర్ల అనే గ్రామంలో ఓహో
ఏకవీర దేవిని సేవించుకొనటానికై ఆహా రుదమదేవి సపరివారంగా వెళ్ళిందయ్యా 
ఆ మట్టున ఎం జరిగింది నాయనా
అదే తరుణమని..మురారినాయుడు ఆలోచించాడు..తంధానతాన 
అరెరె..క్రూర భయంకర ఘోర హంతకుల గుట్టుగపంపాడు..తంధానతాన 
బస్తీకదిలీ పల్లెకువచ్చిన రాణీ రుద్రమకు..తంధానతాన 
అయ్యో పరుగునవచ్చే ప్రమాద ప్రళయం పాపం తెలియదయో..తంధానతాన
పరివారంబున సన్నిధి నుండి పంపివేసినామే..తంధానతాన
చంద్రహాసమే చెంత నుంచుకుని ఒంటిగ నిదురించే 
తంధానా తంధాన ఓ దేవనందనానా..తంధానా తంధాన ఓ దేవనందనానా 
తకట్జంత తకట్జంత తకజనుత తా

కటిక చీకటి కమ్మెరా..సై
కారు మబ్బులే మూసెరా..సై 
శకునపక్షులే కూసెరా..సై
ఆయ్..వల్లకాటి దెయ్యాలురా
వళ్ళు విరిచి మేల్కాంచెరా 
నక్కల పాపిష్ఠి కూతలూ..సై
దిక్కులు పిక్కటిల్లెరా..సై
కెవ్వూ..హోరున గాలులు వీచెరా..సై
గాలికి దివ్వెలు ఆరెరా..సై  
కాళరాత్రి ..గర్జించెరా 
భళానంటి..బాయ్ తమ్ముడా
మేల్ భళానోయ్..బాయ్ దాదానా
భళానంటి బాయ్..తమ్ముడా
మేల్ భళానోయ్..బాయ్ దాదానా
భళానంటి బాయ్..తమ్ముడా
మేల్ భళానోయ్..బాయ్ దాదానా

ఆ భయదబీకర గాడాంధకారంలో అయ్యో ఏం జరిగిందీ 
డెక్కల చప్పుడు దూరంలోన మిక్కుటమైనాయి..తంధానతాన
అంతకంతకూ ఆ సవ్వడులే దగ్గరపడ్డాయి..తంధానతాన
రూపం తెలియని ఆకారాలే దాపురించినాయి  
చీకటిలోన చిక్కటి నీడలు గోడ దూకినాయి
ఖడ్గం దాలిచి రుద్రమదేవి తలుపు తెరిచినాది 
అరెరె..చింతనిప్పులా ఎర్రని కన్నులు ఎదుటనిలిచినాయి
అంతు చిక్కని నల్లని దేహం వింతగ మెరిసింది 
హొయ్..మురారి పంపిన ముష్కరుడప్పుడు కత్తి దూసినాడా..తంధానతాన
హరాం హరా అని ఆడదానిపై వేటు వేసినాడు..ఆ

మీనా--1973
























సంగీతం::రమేష్ నాయుడు
Director::Vijayanirmala 
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,చంద్రమోహన్,S.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ

పల్లవి::

పెళ్ళంటే నూరేళ్ళ పంట..అది పండాలి 
కోరుకున్నవారి యింట..పండాలీ
బంధాలను తెంచుకుని..బాధ్యతలను పెంచుకుని  
అడుగు ముందుకేశావమ్మా..గడప దాటి కదిలావమ్మా 
పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట

చరణం::1

మనిషి విలువ పెరిగేది..ధనం వలన కాదు 
ప్రేమించే హృదయానికి..పేదతనం లేదు
మనిషి విలువ పెరిగేది..ధనం వలన కాదు 
ప్రేమించే హృదయానికి..పేదతనం లేదు

మనసులోని మమతలను..తెలుసుకోరు పెద్దలు 
మనసులోని మమతలను..తెలుసుకోరు పెద్దలు 
అందుకే తిరుగుబాటు..చేసేరు పిల్లలు 
పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట
అది పండాలి..కోరుకున్న..వారి యింట..పండాలీ
పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట

చరణం::2

మంచీ చెడు తెలిసికూడా..చెప్పలేనివారు 
ఎవ్వరికీ పనికిరారు ఏమీ..చేయలేరు
మంచీ చెడు తెలిసికూడా..చెప్పలేనివారు 
ఎవ్వరికీ పనికిరారు ఏమీ..చేయలేరు
అన్నెం పున్నెం ఎరుగని..అమాయకపు 
జీవులు అపనిందల పాలవుతూ..అలమటించుతారు
అన్నెం పున్నెం ఎరుగని..అమాయకపు జీవులు 
అపనిందల పాలవుతూ..అలమటించుతారు 
పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట
అది పండాలి కోరుకున్న..వారి యింట పండాలీ
పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట

చరణం::3

మనసు ఒకరిపైన..మనువు ఒకరితోన 
మనసు ఒకరిపైన..మనువు ఒకరితోన 
ఎలా కుదురుతుందీ..యిది ఎలా జరుగుతుంది 
కలిమికాదు మగువకు కావల్సిందీ
కలిమికాదు..మగువకు..కావల్సిందీ 
మనసిచ్చిన వానితో..మనువు కోరుకుంది 
మనసిచ్చిన వానితో..మనువు కోరుకుంది 
మనువు..కోరుకుంది 

పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట
అది పండాలి కోరుకున్న వారి యింట..పండాలీ
బంధాలను తెంచుకుని..బాధ్యతలను పెంచుకుని 
అడుగు ముందుకు వేశావమ్మా..అడుగు ముందుకు వేశావమ్మా
పెళ్ళంటే..ఏఏఏఏ..నూరేళ్ళ పంట

మీనా--1973






















సంగీతం::రమేష్ నాయుడు
Director::Vijayanirmala 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,చంద్రమోహన్,S.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ

పల్లవి::

చేనుకు గట్టుందీ..యింటికి గడపుందీ 
కంటికి రెప్పుందీ..కన్నెకు హద్దుంది 
హద్దుమీరినా..కాలుజారినా అంతా 
గల్లంతవుతుందీ..గల్లంతవుతుంది..వాట్
అమ్మమ్మమ్మమ్మో అమ్మాయిగారండీ 
ఆగండి చూడండి..ఆ పైన వెళ్ళండి వెళ్ళండి 
ఆగండి చూడండి..ఆ పైన వెళ్ళండి వెళ్ళండి

చరణం::1

పల్లెటూరిలో బస్తీనడకలు..మార్చుకోవాలి 
కళ్ళూ కాళ్ళూ నేలమీదనే..వుంచుకోవాలి
ముళ్ళుంటాయి..రాళ్ళుంటాయి..ఎత్తూ పల్లాలుంటాయి 
మొండితనంగా..పరుగులుతీస్తే..ముందరి పళ్ళే రాల్తాయి
అమ్మమ్మమ్మమ్మో అమ్మాయిగారండీ..ఆగండి చూడండి 
ఆ పైన వెళ్ళండి..ఆగండి చూడండి ఆ పైన వెళ్ళండి

చరణం::2

పంజరంలో చిలకకుమల్లే..పెరిగావిన్నాళ్ళు 
రెక్కలు వచ్చాయనుకుని..ఎగిరే వచ్చావీనాడు
పంజరంలో చిలకకుమల్లే..పెరిగావిన్నాళ్ళు 
రెక్కలు వచ్చాయనుకుని..ఎగిరే వచ్చావీనాడు
నువ్వనుకున్నట్టే..అన్నీ జరగవు 
నీకిష్టంలేదని ఏవీ..ఆగవు
అమ్మమ్మమ్మమ్మో..అమ్మాయిగారండీ 
ఆగండి చూడండి..ఆ పైన వెళ్ళండి 
ఆగండి చూడండి..ఆ పైన వెళ్ళండి వెళ్ళండి

Wednesday, August 08, 2007

మీన--1970::కల్యాణి ::రాగం
















సంగీతం::రమేష్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,ఎస్.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ

రాగం:::కల్యాణి :::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు..
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు..
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు..కమనీయుడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు..
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
కోతిమూకలతో..ఆ ఆ ఆ
కోతిమూకలతో లంక పై దండెత్తు కోదండరామయ్య రణధీరుడు..రణధీరుడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు..
పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు..అఖిలాత్ముడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి
..

Wednesday, July 04, 2007

మీన--1970-- రాగం:ఖామాస్
















!! రాగం:ఖామాస్ !!

సంగీతం: రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం: P.సుశీల

తారాగణం::కృష్ణ,విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ,ఎస్.వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ


మల్లె తీగవంటిదీ మగువ జీవితం 2
చల్లనిపందిరి వుంటే
అల్లుకొపోయేనూ అల్లుకొ పోయేనూ


!! మల్లె తీగవంటిదీ మగువ జీవితం !!

తల్లి తండ్రుల ముద్దూమురిపెం
చిన్నతనం లో కావాలీ 2
ఇల్లలికి పతి అనురాగం
ఎల్లకాలమూ నిలవాలి 2
తల్లికి పిల్లల ఆదరణ
పండు వయసులో కావాలీ
ఆడవారికీ అన్నివేళలా
తోడూనీడ వుండాలీ
తోడూనీడ వుం
డాలీ

!! మల్లె తీగవంటిదీ మగువ జీవితం !!

నుదుట కుంకుమ కళ కళ లాడే
సుధతే ఇంటికి శోభా 2
పిల్లల పాపలప్రేమగ పెంచే
తల్లే ఆరని జ్యోతీ 2
అనురాగం తో మనసును దోచే
వనితే మమతల పంటా
జన్మను ఇచ్చి జాతిని నిలిపే
జననే జగతికి ఆధారం
జననే జగతికి ఆధా
రం
!! మల్లె తీగవంటిదీ మగువ జీవితం !!