సంగీతం::S.P.కోదండపాణి
రచన::వేటూరి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి
పల్లవి::
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా
గడసరి నాసామి..రావేలా
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా
గడసరి నాసామి..రావేలా
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా
చరణం::1
మల్లెలుపూచే చల్లని..వేళా
మదిలోరేగే తీయని..జ్వాలా
మల్లెలుపూచే చల్లని..వేళా
మదిలోరేగే తీయని..జ్వాలా
వయసే పాడే..వలపుల జోలా
మాటవిందువని..ఏలుకొందువని
మదిని నమ్ముకొని..మరిమరి పిలిచితిని
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా
గడసరి నాసామి..రావేలా
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా
చరణం::2
పచ్చని సొగసూ..వాడకముందే
పరువం పల్లవి..పాడకముందే
ఏఏఏఏఏ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పచ్చని సొగసూ..వాడకముందే
పరువం పల్లవి..పాడకముందే
పరులకుమరులే..కలుగకముందే
మనసుమార్చుకొని..దరికిచేర్చుకొని
తనివి తీర్చమని..మరి మరి వేడతిని
సరి సరి ఈ వేళ..ఈ బిగువేలా
చరణం::3
రావే రావె రస..తరంగిణీ
రాగము నీవే..రాగ రాగిణీ
మదిలో మెదిలె..మధుర రూపిణీ
నీ అందియల వలపు పిలుపు..విని
నా దెందమున మరులు..నిలుపుకొని
తలచి వలచి నిలిపి..పిలిచితిని
పలుకవె ఒకసారి..ఓ సుకుమారి
తరగని వన్నెల..వయ్యారీ
పలుకవె ఒకసారి..ఓ సుకుమారీ
No comments:
Post a Comment