సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘంటసాల
చిక్కావు చేతిలో చిలకమ్మా
నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా
అహ్హా..అహ్హా..అహ్హా..
చిక్కావు చేతిలో చిలకమ్మా
నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా
అహా..ఆహా..ఆహా..
చిక్కావు చేతిలో చిలకమ్మా
నీ కోరచూపు చూచీ బెదరిపోదునా
ఖస్సు భుస్సు అనగానే అధిరిపోదునా
పొగరంతా అణిగిందా..బిగువంత తగ్గిందా
పొగరంతా అణిగిందా..బిగువంత తగ్గిందా
తప్పు ఒప్పుకొంటావా..చెంపలేసుకొంటావ
చిక్కావు చేతిలో చిలకమ్మా
నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా
అహ్హా..అహ్హా..
చిక్కావు చేతిలో చిలకమ్మా
కల్ల..బొల్లి..మాటలతో కైపెక్కిస్తావా
హొయలు వగలు చూపించీ వల్లో వేస్తావా
నాటకాలూ..ఆడేవా..నాటకాలూ..ఆడేవా
నవ్వులపాలు చేసేవా..నీ టక్కులు సాగవమ్మా
నీ పప్పులు ఉడక్కవమ్మా..
చిక్కావు చేతిలో చిలకమ్మా
నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా
అహ్హా..అహ్హా..
చిక్కావు చేతిలో చిలకమ్మా
మోసాన్ని మోసంతోటే..పందెమేసి గెలిచానూ
వేషానికి వేషంవేసీ..ఎదురుదెబ్బ తీసాను
మోసాన్ని మోసంతోటే..పందెమేసి గెలిచానూ
వేషానికి వేషంవేసీ..ఎదురుదెబ్బ తీసాను
గర్వాన్నీ వదిలించీ..గర్వాన్నీ వదిలించీ
కళ్ళుబాగా తెరిపించీ..కాళ్ళబేరానికి
నిన్ను రప్పించానూ...
చిక్కావు చేతిలో చిలకమ్మా
నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా
అహ్హా..అహ్హా..
చిక్కావు చేతిలో చిలకమ్మా
1 comment:
movie gurinchi kastha vivaristhe bagundedhi...
Post a Comment