Thursday, March 25, 2010

పెళ్ళిరోజు--1968







సంగీతం::M.S.శ్రీరాం
రచన::రాజశ్రీ
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల
తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి

పల్లవి::

జీవితాన మరువలేను..ఒకే రోజు 
ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు 
అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ

జీవితాన మరువలేము..ఒకే రోజు 
ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు 
అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ

చరణం::1

నిన్న చూడ నీవు నేను..ఎవరికెవరమో
నేడు చూడ నీవు నేను..ఒకరికొకరిమే 
నిన్న చూడ నీవు నేను..ఎవరికెవరమో 
నేడు చూడ నీవు నేను..ఒకరికొకరిమే 
రేపు చూడు పెళ్ళినాడు..మనము ఏకమై
ఓ ఓ ఓ ఓ ఓ కలసిపోదమే...

జీవితాన మరువలేము..ఒకే రోజు 
ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు 
అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ 

చరణం::2

నింగినుండి చెందమామ..తోంగి చూచేనే
మధురమైన కలతలేవో..మనసుతెలిపెనే 
ఊహలన్నీ ఉరకలేసి..చిందులాడెనే
ఓ..హో..మనసుపోంగెనే.. 

చరణం::3

తలపులందు తెలియరాని..వేడి వున్నదీ 
నేడుచూచి కన్నె మనసు..కరుగుతున్నదీ 
తలపులందు తెలియరాని..వేడి వున్నదీ
నేడుచూచి కన్నె మనసు..కరుగుతున్నదీ 
కన్నె మనసు కరుగువేళ..బిడియమెందుకూ
హో..ఓ..రాకు ముందుకూ..

జీవితాన మరువలేము..ఒకే రోజు 
ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు 
అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ

No comments: