సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::P.సుశీల
తారాగణం::మోహన్‌బాబు,జయసుధ,గుమ్మడి,ప్రభాకరరెడ్డి,గిరిబాబు
పల్లవి::
శ్రీసత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
శ్రీసత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
నోచిన వారికి నోచిన..వరము
చూసిన వారికి చూసిన..ఫలము
శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
చరణం::1
స్వామిని పూజించే..చేతులె చేతులటా
ఆ మూర్తిని దర్శించే..కనులే కన్నులటా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
స్వామిని పూజించే..చేతులె చేతులటా
ఆ మూర్తిని దర్శించే..కనులే కన్నులటా
తన కథ వింటే ఎవ్వరికైనా..జన్మ తరించునట
శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
చరణం::2
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఏ వేళైన ఏ శుభమైనా..కొలిచే దైవం ఈ దైవం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ
ఏ వేళైన ఏ శుభమైనా..కొలిచే దైవం ఈ దైవం
అన్నవరంలో వెలసిన దైవం..ప్రతి ఇంటికి దైవం..ఉ
శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
చరణం::3
అర్చన చేద్దామా మనసు..అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల..కడదామా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అర్చన చేద్దామా మనసు..అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల..కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు..ఇమ్మని కోరేమా..ఆ
శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా
మంగళమనరమ్మా జయ..మంగళమనరమ్మ
కరములు జోడించి..శ్రీ చందనమలరించి
మంగళమనరే శ్రీ సుందరముర్తికి..వందనమనరమ్మ
No comments:
Post a Comment