సంగీతం::M.S.శ్రీరాం
రచన::రాజశ్రీ
గానం::P.B.శ్రీనివాస్
తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి
పల్లవి::
ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ
మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా?
ఆనాటి చెలిమి ఒక కల..
చరణం::1
మనసనేదే లేని నాడు..మనిషికేదీ వెల
మనసనేదే లేని నాడు..మనిషికేదీ వెల
మమతనేదే లేని నాడు..మనసు కాదది శిల
ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ
చరణం::2
చందమామే రాని నాడు..లేదులే వెన్నెల
చందమామే రాని నాడు..లేదులే వెన్నెల
ప్రేమనేదే లేని నాడు..బ్రతుకులే వెల వెల
ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ
చరణం::3
ఒక్కసారి వెనుక తిరిగి..చూసుకో జీవితం
ఒక్కసారి వెనుక తిరిగి..చూసుకో జీవితం
పరిచయాలు అనుభవాలు..గురుతు చేయును గతం
ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ
మనసులోని మమతలన్ని..మరచిపోవుట ఎలా?మరచిపోవుట ఎలా?
No comments:
Post a Comment