Thursday, March 25, 2010

పెళ్ళిరోజు--1968






సంగీతం::M.S.శ్రీరాం
రచన::రాజశ్రీ
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల
తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి

పల్లవి::

అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
తీయరాదా..సిగ్గు పరదా..ఎవరు లేరు కదా..ఆ..

అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
ఇంతలోనే..అంతప్రేమ..కలిగె నెందుకనీ..ఈ..

అడుగుదామని ఉంది నిన్నొక మాట

చరణం::1

పసిదానిగ నటీయించి..మది దోచావెందులకు?
నేనెవరో తెలియకనే..నను పిలిచావెందులకు?
ఇది ఏమి గడుసుతనం..ఇది ఏమి చిలిపితనం
కాదు..పడుచుతనం..ఊ..ఊ..

అడుగుదామని ఉంది నిన్నొక మాట

చరణం::2

మన పరిచయమొక కథగా..జరిగింది మొదటిరోజు
ఆ పరిచయ ఫలితముగా..పెరిగింది ప్రేమ మోజు
ఏనాటి అనుబంధమో..గతజన్మలో బంధమో
ఎందుకీ స్నేహమో..

అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
ఇంతలోనే..అంతప్రేమ..కలిగె నెందుకనీ..ఈ..

అడుగుదామని ఉంది నిన్నొక మాట

No comments: