Thursday, March 25, 2010

దసరాబుల్లోడు--1971




















సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,పిఠాపురం  
తారాగణం::నాగేశ్వర రావ్ , వాణీశ్రీ , చంద్రకళ 

పల్లవి::

బోడి::ఓ..మల్లయ్యగారి ఎల్లయ్యగారి..బుల్లెమ్మా
బుల్లెయ్యగారి చెల్లెమ్మా..
నీ పురాణమంతా బుర్ర కధగా చెబుతామమ్మా
వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
బోడి::బుల్లెమ్మంటే పల్లెటూళ్ళలో ఎల్లరెరిగిన యిల్లాలండి
కోరస్::తందానా..తాన                                
బోడి::ఓహో..బుల్లెమ్మంటే పల్లెటూళ్ళలో ఎల్లరెరిగిన యిల్లాలండి
కోరస్::తందానా..తాన 

వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..

చరణం::1

బోడి::పిల్లికి బిచ్చం పెట్టని తల్లి
కోరస్::బుల్లెమ్మా
బోడి::ఎంగిలి చేత్తో కాకిని తోలని   
కొరస్::బుల్లెమ్మా
బోడి::తవుడూ చిట్టూ ధాన్యం గీన్యం  ఊళ్ళో అమ్మీ
పాలు పెరుగు వెన్నా నెయ్యి బస్తీ కమ్మీ
కడుగు నీళ్ళే మొగుడి ముఖాన కొడతావమ్మా
ఒకడు::అయ్యో..
బోడి::కడుపు కట్టి..మూటలు కట్టి దాస్తావమ్మా
కోరస్::దాస్తావమ్మా                                   

హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా 
వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా

చరణం::2 
                  
బోడి::చదివేదేమో రామాయణము సంసారంలో రావణయుద్దము
చదివేదేమో రామాయణము సంసారంలో రావణయుద్దము
పాతివ్రత్యమే పారాయణము..పచ్చడి మెతుకులె భర్తకు దినము 
పాతివ్రత్యమే పారాయణము..పచ్చడి మెతుకులె భర్తకు దినము 
పిల్లా మేకా లేరు కదమ్మా..ఆ..అహా..లేరుకదమ్మా
యీ పిసినిగొట్టు బ్రతుకేం ఖర్మా
ఒకడు::నీ ఖర్మా..
బోడి::హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా 
కోరస్::అహా..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా     

No comments: