సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::నాగేశ్వర రావ్ , వాణీశ్రీ , చంద్రకళ
వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా
వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా
వెళ్ళిపోతున్నావా..అమ్మా
చరణం::1
నువ్వే అమ్మని అన్నే నాన్నని అల్లారుముద్దుగా పెరిగానే
ఈ లోకం ఎరుగక బాధే తెలియక పసిపాపడిలా పెంచారే
అమ్మా ఏమై పోవాలి..నేనెలా బ్రతకాలి
వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా
చరణం::2
పంపకాలే తలవంపులనీ..రెండు యిళ్ళను కలుపుతాననీ
పెంపక మిచ్చారానాడు..ఆ దత్తే నేడు నా దేవుళ్ళను
నడివీధికీ లాగిందమ్మా..నవ్వుల పాలు చేసిందమ్మా
వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా
చరణం::3
ప్రాణం దేహం విడిపోతున్నవి..పాలమనసూ కన్నీరైనది
ఎవరో పెట్టిన అనలం రగిలీ..యిందరి మమతలు బలికోరినదీ
అమ్మా ఏమై పోవాలి..నేనింకెలా బ్రతకాలి
నేఇంకెలా బ్రతకాలి..ఎలా బ్రతాకాలీ..
No comments:
Post a Comment