Monday, March 05, 2007

సుమంగళి--1940


సంగీతం::చిత్తూరు వి.నాగయ్య
రచన::సముద్రల రాఘవాచార్య(సీనియర్) 
గానం::గౌరీపతి శాస్త్రి  

పల్లవి::

కాటమరాయడ కదిరీ నరసింహుడ
కాటమరాయడ కదిరీ నరసింహుడ
కాటమరాయడ కదిరీ నరసింహుడ
కాటమరాయడ కదిరీ నరసింహుడ
మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
బేట్రాయి సామి దేవుడా..నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
సేప కడుపున సేరి పుట్టితీ
రాకాసిగాని కోపాన సీరికొట్టితీ
సేప కడుపున సేరి పుట్టితీ
రాకాసిగాని కోపాన సీరికొట్టితీ
ఓపినన్ని నీళ్లలోన యెలసియేగ తిరిగినీవు
బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి సామి దేవుడా..నన్నేలినోడ 
బేట్రాయి సామి దేవుడా

No comments: