Saturday, March 24, 2007

అమెరికా అమ్మాయి--1976

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4721
సంగీతం::G.K.వెంకటేశ్
రచన::ఆరుద్ర 
గానం::S.P.బాలు,వాణిజయరాం   

పల్లవి:: 

జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగుల తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ..ఓ..ఓ..బెదురుచు చేరెను చిలకమ్మా

చరణం::1 

కొండల కోనల కోయిల పాడెను సంగీతం
కొండల కోనల కోయిల పాడెను సంగీతం
మధువులు ఆనుచు..మత్తుగ పాడుచు..తుమ్మెద ఆడేను సల్లాపం

జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
బెదురుచు చేరెను చిలకమ్మా

చరణం::2

పచ్చని పసరిక పానుపు పరిచెను పోదరి౦ట్లో
పచ్చని పసరిక పానుపుపరిచెను పోదరి౦ట్లో
వెచ్చనివలపుల ముచ్చట తీరగ తనువులు కరిగెను కౌగిట్లో
ఓ..ఓ..జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా 
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
బెదురుచు చేరెను చిలకమ్మా

No comments: