Saturday, March 10, 2007

గుండమ్మ కథ--1962::ఆభేరి::రాగం



డైరెక్టర్::కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
ఆభేరి::రాగం
 


ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ అహహ అహహ
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో

తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో అహహ అహహ
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో

చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
...అహహ అహహ అహహ ఆహహహ
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి సాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో

కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
...అహహ అహహ అహహహ ఆహహహ
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా అహహ అహహ
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా

తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో

No comments: