డైరెక్టర్కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,
హరనాధ్, ఛాయాదేవి.
రాగం::మోహన
పల్లవి::
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే నీ మనసు కనుగొంటిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
చరణం::1
కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమ్రుతవాహిని ఓలలాడి మైమరచితిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిల
చరణం::2
ముసిముసినవ్వుల మోముగని నను ఏలుకొంటివని మురిసితిలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముసిముసినవ్వుల మోముగని నను ఏలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ వలపు పాసమని వెదరితిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే నీ మనసు కనుగొంటిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
No comments:
Post a Comment