Wednesday, March 07, 2007

గుండమ్మ కథ--1962::దేశ్::రాగ

డైరెక్టర్::కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి
గానం::P.సుశీల

దేశ్::రాగ
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,
హరనాధ్, ఛాయాదేవి.

అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపులలోనె
రుసరుసలాడే చూపులలోనె ముసి ముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

:::1

అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జలు ఘల్లన
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి ఈ ఈ ఈ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరి ఏమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

:::2

మో
హన మురళి గానము వినగా తహ తహ లాడుచు తరుణులు రాగా
మోహన మురళి గానము వినగా తహ తహ లాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
దృష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

No comments: