Saturday, March 10, 2007

గుండమ్మ కథ--1962



డైరెక్టర్::కమలాకర్,కామేస్వర రావ్
రచన::పింగళి నాగేద్ర రావ్
సంగీతం::ఘంటసాల

గానం::ఘంటసాల
ప్రొడ్యుసర్::చక్రపాణి,నాగిరెడ్డి

తారాగణం::N.T.రామారావు,అక్కినేని,జమున,సావత్రి,S.V.రంగారావు,రాజనాల,రమణారెడ్డి,L.విజయలక్ష్మి,

హరనాధ్, ఛాయాదేవి.

:::

ఏం బుల్లెమ్మ ఏమన్నా పనిఉంటే చెప్పు చేస్తా
ఈవాళ ఏమిపనులు లేవు అన్ని చేసేసాను
అ పనిచేస్తూనే లేదంటావ్
లే నే రుబ్బుత
వద్దులే ఇది ఆడవాళ్ళు చేసే పని
ఆ ఆడల్లేంటి మగాల్లేంటి
ఆడాళ్ళు కందిపోతారని ఈరోజుల్లో ఈ పనులన్నీ మాగాల్లె చేస్తున్నారుగా నీకు తెలువదు
సరిసరి
నేనే అనుకుంటే నాకన్నా వెనుకబడ్డట్టున్నావే
లేలే బుల్లెమ్మ లేలే
అ అ అ పట్టుర బుల్లోడా
ఏం బుల్లెమ్మ నేను సరిగా రుబ్బుతున్నాన
అ అ ఏం బుల్లెమ్మ నవ్వుతున్నావ్
నాకు బువ్వండటం కూడా చేతనవును
ఆ మాఅయ్యా వేదాంతి
పనులన్నీ తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారురా అనేవారు
నీకు తెలువదు అనుకుంట
ఇప్పుడు మగాళ్ళతో పోటిచేస్తున్నారుగా ఆడాళ్ళు



లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
ఆ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

ఎపుడో చెప్పెను వేమన గారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఎపుడో చెప్పెను వేమన గారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఇపుడే చెబుత వినుకో బుల్లెమ్మ
ఆఆఆఅ...ఆ.ఆఆ.....
విసన్నచెప్పిన వేదం కూడా
లేచింది..నిద్ర లేచింది మహిళా లోకం

చరణం::1

పల్లెటూర్లలో పంచాయతీలు
పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూర్లలో పంచాయతీలు
పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది యేమని అన్ని రంగములా
ఆఆ....ఆఆ....
అది ఇది యేమని అన్ని రంగములా
మగధీరుల నేదిరించారు
నిరుద్యోగులను పెంచారు
లేచింది..నిద్ర లేచింది మహిళా లోకం

చరణం::2

చట్టసభలలో సీట్ల కోసం
భర్తల తోనే పోటీచేసి
చట్టసభలలో సీట్ల కోసం
భర్తల తోనే పోటీచేసి
డిల్లి సభలో పీటం వేసీ
ఈఈఇ....ఈఇ.....
డిల్లి సభలో పీటం వేసీ
లేక్చరులేన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారు

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

No comments: