Wednesday, April 28, 2010

ఏదిపాపం - ఏది పుణ్యం--1979




సంగీతం::సత్యం
రచన::మైలవరపుగోపి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

కాలమిలా ఆగిపోని..కలనిజమై సాగిపోని
అన్నిమరచి ఈ నిముషంలో..నీ ఒడిలోనే నిదురపోనీ

కాలమిలా ఆగిపోని కలనిజమై సాగిపోని
అన్నిమరచి ఈ నిముషంలో..నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ......

చరణం::1

తొలిసంజె మలిసంజె లేలా..నా చెంత చెలి ఉన్నవేళ
తొలిసంజె మలిసంజె లేలా..నా చెంత చెలి ఉన్నవేళ
చిరుగాలి సెలఏరు లేలా..నా మనషి తోడున్న వేళ
అనువైన వేళా..ఈ శుభవేళా
బ్రతుకే వెన్నెల వేళా..వేళా..వేళా...

కాలమిలా ఆగిపోనీ,,కలనిజమై సాగిపోనీ
అన్నీమరచి...ఆ ఆ..
ఈ నిముషంలో..ఆ ఆ..
నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ.......

చరణం::2

సిరిదివ్యలో వెలుగులాగా..నీచూపులో నిలిచిపోనీ
సిరిదివ్యలో వెలుగులాగా..నీచూపులో నిలిచిపోనీ
జేగంటలో రవళి లాగా..నీ ఊపిరై కలసిపోనీ..
కలలే గానీ..కలతే లేనీ
లోకానికే చేరిపోనీ..చేరిపోనీ..చేరిపోనీ..

కాలమిలా ఆగిపోనీ..కలనిజమై సాగిపోనీ
అన్నీమరచీ..ఆ ఆ
ఈ నిముషంలో..ఆ ఆ
నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ

Thursday, April 15, 2010

మంగళ తోరణాలు--1979



సంగీతం::రమేశ్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,S.జానకి 
Film Directed By::Singeetam Sreenivaasa Rao
తారాగణం::చంద్రమోహన్,తాళ్ళూరి రాజేశ్వరి,జగ్గయ్య,నాగభూషణం,నూతన్‌ప్రసాద్,
జయమాలిని,


పల్లవి::

ఉదయమౌతున్నా..సందెపడుతున్నా..ఆఆఆ 
ఉదయమౌతున్నా..సందెపడుతున్నా
కదలదు కాలం..ఎందుకని
ఇంత చేరువగా..మనముంటున్నా
అంత..దూరం దేనికని
ఉదయమౌతున్నా..ఆఆఆఆఆ  

ఉదయమౌతున్నా..సందెపడుతున్నా
కదలదు కాలం..ఎందుకని
ఇంత చేరువగా..మనముంటున్నా
అంత..దూరం..దేనికని
ఉదయమౌతున్నా..ఆఆఆఆఅ

చరణం::1

కనుల నిండా..నీవే ఉంటే
కమ్మని నిదురకు..చోటేది?
మనసు నిండా..నీవే ఉంటే
తనువుకు నిలకడ..ఎక్కడిది? 

నిట్టూర్పే..ఆ తారకనడిగెను 
నీవాడు నిను చేర..రాడెమని
బదులు..పలికెను నా మూగ కన్నీరు
అది ఆ..జాబిలి నడగమని

ఉదయమౌతున్నా..సందెపడుతున్నా
కదలదు కాలం..ఎందుకని
ఇంత చేరువగా..మనముంటున్నా
అంత..దూరం..దేనికని
ఉదయమౌతున్నా..ఆఆఆఆఅ  

చరణం::2 

నిలిచిపోయేను..గాలి పరుగు
నీ అడుగుల..సడి లేదేమని
వెలవెలబోయెను..కోయిల పిలుపు
నీ పలుకే..వినరాదేమని

కోవెల గంటలు..జాలిగ అడిగెను
నీ వాడు ఏవైపు..రాడేమని?
బదులు పలికెను..నా చేదు చిరునవ్వు
అది ఆ దేవుణ్ణే..అడగమని..ఈ

ఉదయమౌతున్నా..సందెపడుతున్నా..ఆఆఆ..హా
ఉదయమౌతున్నా..సందెపడుతున్నా
కదలదు కాలం..ఎందుకని

ఇంత చేరువగా మనముంటున్నా
అంత..దూరం..దేనికని?

ఉదయమౌతున్నా..ఆ..ఆ..ఆ..ఆ 
సందెపడుతున్నా..ఆ..ఆ..ఆ
ఉదయమౌతున్నా..ఆ..ఆ..ఆ..ఆ 
సందెపడుతున్నా..ఆ..ఆ..ఆ
ఉదయమౌతున్నా..ఆ..ఆ..ఆ..ఆ
సందెపడుతున్నా..ఆ..ఆ..ఆ

Mangala Toranaalu--1979
Music::Rameshnaayudu
Lrtics::D.C.Naaraayana Reddi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Singeetam Sreenivaasa Rao
Cast::Chandramohan.Jaggayya,Naagabhuushanam,Nootanprasaad,Taalluuri Raajeswari,Jayamaalini.

:::::::::::::::::::::::::::::::::::::::::

udayamautunnaa..sandepaDutunnaa..aaaaaaaaa 
udayamautunnaa..sandepaDutunnaa
kadaladu kaalam..endukani
inta chEruvagaa..manamunTunnaa
anta..dooram dEnikani
udayamautunnaa..aaaaaaaaaaaaaa  

udayamautunnaa..sandepaDutunnaa
kadaladu kaalam..endukani
inta chEruvagaa..manamunTunnaa
anta..dooram..dEnikani
udayamautunnaa..aaaaaaaaaaa

::::1

kanula ninDaa..neevE unTE
kammani niduraku..chOTEdi?
manasu ninDaa..neevE unTE
tanuvuku nilakaDa..ekkaDidi? 

niTToorpE..aa taarakanaDigenu 
neevaaDu ninu chEra..raaDemani
badulu..palikenu naa mooga kanneeru
adi aa..jaabili naDagamani

udayamautunnaa..sandepaDutunnaa
kadaladu kaalam..endukani
inta chEruvagaa..manamunTunnaa
anta..dooram..dEnikani
udayamautunnaa..aaaaaaaaaaa  

::::2 

nilichipOyEnu..gaali parugu
nii aDugula..saDi lEdEmani
velavelabOyenu..kOyila pilupu
nii palukE..vinaraadEmani

kOvela ganTalu..jaaliga aDigenu
nii vaaDu Evaipu..raaDEmani?
badulu palikenu..naa chEdu chirunavvu
adi aa dEvuNNE..aDagamani..ii

udayamautunnaa..sandepaDutunnaa..aaaaaaaa..haa
udayamautunnaa..sandepaDutunnaa
kadaladu kaalam..endukani

inta chEruvagaa manamunTunnaa
anta..dooram..dEnikani?

udayamautunnaa..aa..aa..aa..aa 
sandepaDutunnaa..aa..aa..aa
udayamautunnaa..aa..aa..aa..aa 
sandepaDutunnaa..aa..aa..aa
udayamautunnaa..aa..aa..aa..aa
sandepaDutunnaa..aa..aa..aa

Tuesday, April 13, 2010

మౌన రాగం--1986



సంగీతం::ఇళయరాజ 
రచన::రాజశ్రీ 
గానం::S.P.బాలు
Film Directed By::Mani Sarma
తారాగణం::మోహన్,రేవతి

పల్లవి::

ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ 
చెలీ రావా..వరాలీవా 
నిన్నే కోరే..ఓ జాబిల్లి
నీ జతకై వేచేనూ..నిలువెల్లా నీవే
చెలీ రావా..వరాలీవా

చరణం::1

ఈ వేదనా తాళలేనే..భామా చందమామా 
వెన్నెల్లనే పూలు రువ్వి..చూడు ఊసులాడు 
చెప్పాలని నీతో..ఎదో చిన్న మాటా   
చెయ్యాలనీ స్నేహం..నీతో పూట పూట
ఊ అంటే నీ నోట..బ్రతుకే వెన్నల తోట

చెలీ రావా..వరాలీవా

చరణం::2

వయ్యా రాల నీలి నింగి..పాడే కథలు పాడే
ఉయ్యాలగా చల్ల గాలి..ఆడే చిందులాడే
సుగంధాల ప్రేమా..అందిచగా రాదా 
సుతారాల మాటా..చిందించగా రాదా
ఆకాశం పగ అయితే..మేఘం కదలాడేనా

చెలీ రావా..వరాలీవా
నిన్నే కోరే..ఓ జాబిల్లి
నీ జతకై వేచేనూ..నిలువెల్లా నీవే 
చెలీ రావా..వరాలీవా
నిన్నే కోరే..ఓ జాబిల్లి

Saturday, April 10, 2010

పండంటి కాపురం--1972

















సంగీతం::S.P.కోదండపాణి
రచన::మైలవరపు గోపి
గానం::S.P.కోదండపాణి, P.సుశీల
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, జమున, ప్రభాకరరెడ్డి,B.సరోజాదేవి,
జయసుధ, S.V.రంగారావు, రాజబాబు,  

పల్లవి:: 

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు 
బంధాలేమో పదివేలు 

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు 
బంధాలేమో పదివేలు

చరణం::1 

నదిలో నావ ఈ బ్రతుకు
దైవం నడుపును తన బసకు
ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
నదిలో నావ ఈ బ్రతుకు
దైవం నడుపును తన బసకు
అనుబంధాలు ఆనందాలు 
తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు 
బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

చరణం::2 

రాగం ద్వేషం రంగులురా
భోగం భాగ్యం తళుకేరా
ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
రాగం ద్వేషం రంగులురా
భోగం భాగ్యం తళుకేరా
కునికే దీపం తొణికే ప్రాణం
నిలిచేకాలం తెలియదురా
నిలిచేకాలం తెలియదురా

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు 
బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

చిల్లర దేవుళ్ళు--1977




















సంగీతం::K.V.మహాదేవన్ గారు 
రచన::ఆత్రేయ గారు
గానం::S.P.బాలు
తారాగణం::వినయ్ కుమార్, ఉమా భారతి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పాడాలనే ఉన్నది..విని మెచ్చి
మనసిచ్చే..మనిషుంటే
పాడాలనే ఉన్నది..విని మెచ్చి
మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది

చరణం::1

పాడాలంటే హృదయం ఉండాలి
పాడాలంటే హృదయం ఉండాలి
హృదయానికి ఏదో కదలిక రావాలి
పాడాలంటే హృదయం ఉండాలి
హృదయానికి ఏదో కదలిక రావాలి

భావం పొంగాలి..రాగం పలకాలి
దానికి జీవం పోయాలి
భావం పొంగాలి..రాగం పలకాలి
దానికి జీవం పోయాలి

పాడాలనే ఉన్నది..విని మెచ్చి
మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది

చరణం::2

పాడానంటే..రాళ్ళే కరగాలి
ఆ రాళ్ళకు నోళ్ళోచ్చి..కథలే చెప్పాలి
పాడానంటే..రాళ్ళే కరగాలి
ఆ రాళ్ళకు నోళ్ళోచ్చి..కథలే చెప్పాలి

ముసుగులు తొలగాలి..మసకలు పోవాలి
గదిలో దేవత కనుతెరవాలి..పాడాలనే ఉన్నది
ముసుగులు తొలగాలి..మసకలు పోవాలి
గదిలో దేవత కనుతెరవాలి..పాడాలనే ఉన్నది

పాడాలనే ఉన్నది..విని మెచ్చి
మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది..ఈ..

Friday, April 09, 2010

Dr.చక్రవర్తి--1964






సంగీతం::S. రాజేశ్వరరావు 
రచన::దాశరధి
గానం::మాధవపెద్ది,P.సుశీల బృందం
తారాగణం::అక్కినేని, జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి, జానకి,గీతాంజలి,కృష్ణకుమారి 

పల్లవి::  

ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
నీ హంగు చూసి పొంగిపోనులేరా
ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
నీ హంగు చూసి పొంగిపోనులేరా
నా సామిరంగ దండమోయీ..హోయ్..నా జోలికింక రాకోయీ
హాయ్..హాయ్..ఓ సిన్నోడ ఓ సిన్నోడ ఓ సిన్నోడా..

హోయ్..బోంగరాల బుగ్గలున్నదానా..
నీ కొంగు తగిలి పొంగిపోతి జాణా
హోయ్..బోంగరాల బుగ్గలున్నదానా..
నీ కొంగు తగిలి పొంగిపోతి జాణా..హోయ్ హోయ్
నీవ్ ఖస్సుమంటే తాళలేనే..హోయ్..నీ పొందుకోరివచ్చినానే
హాయ్..హాయ్..ఓ చెలియ ఓ చెలియ ఓ చెలియా..

చరణం::1

నీ కైపు కళ్ళతో నీ కోంటే నవ్వుతో..గారడి చేసావూ
భలే..భలే..నీ తీపిమాటలూ నీళ్ళల్లోమూటలూ నిన్నింక నమ్మనోయీ 
నా సిలకా..హోయ్ హోయ్..నీ అలకా..హోయ్ హోయ్..తెచ్చిందిలే అందం 
నా కళ్ళు చూడవే ఈ బొమ్మ ఆడవే..మనసంత నీవేలే..ఏ..
పో పోవోయ్..ఓయ్ పిల్లోయ్..కిల్లాడిచాలులే..

హోయ్..బోంగరాల బుగ్గలున్నదానా..
నీ కొంగు తగిలి పొంగిపోతి జాణా..హోయ్ హోయ్
నీవ్ ఖస్సుమంటే తాళలేనే..హోయ్..నీ పొందుకోరివచ్చినానే
హాయ్..హాయ్..ఓ చెలియ ఓ చెలియ ఓ చెలియా..

చరణం::2

ముచ్చట్లు గాలితో మురిపాలు పూలతో..నటనలు నాతోనా
సరసాల సుక్కతో సరదాలు మబ్బుతో..సైయ్యాట నాతోనా 
ఇటు సూడవే,,హోయ్ హోయ్..నీతోడులే..హాయ్ హాయ్..
దాసుడు నీవాడే..ఏ..నీవుంటే పక్కనా..మనసెంతో చల్లనా నారాణి నీవేలే
ఓ రాజా..నారోజా..ఈ రోజు హాయ్..హాయ్..

ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
నీ హంగు చూసి పొంగిపోనులేరా
ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
నీ హంగు చూసి పొంగిపోనులేరా
నా సామిరంగ దండమోయీ..హోయ్..నా జోలికింక రాకోయీ
హాయ్..హాయ్..ఓ సిన్నోడ ఓ సిన్నోడ ఓ సిన్నోడా..

ఆ ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ హోయ్
ఆ ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ హోయ్
ఆ ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ హోయ్
ఆ ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ హోయ్
ఆ బలే బలే బలే..ఆ బలే బలే బలే
హోయ్.........య్యా...

Dr.chakravarti--1964
Music::S.Rajeswara Rao
Lyrics::Dasaradhi
Singer's::Madhavapeddi,P.Suseela,Brundam
Cast::{ANR}Akineni,Jaggayya,Gummadi,Savitri,Geetanjali,Krishnakumari

:::1 

O ungaraala mungurula raaja nee hangu chUsi mOsapOnu lEra
O ungaraala mungurula raaja nee hangu chUsi mOsapOnu lEra
naa saamiranga danDamOyii..hOy..naa jOlikinka raakOyii
haay..haay..O sinnODa O sinnODa O sinnODaa..

hOy..bOngaraala buggalunnadaanaa..
nee kongu tagili pongipOti jaaNaa
hOy..bOngaraala buggalunnadaanaa..
nee kongu tagili pongipOti jaaNaa..hOy hOy
neev khassumanTE taaLalEnE..hOy..nee pondukOrivachchinaanE
haay..haay..O cheliya O cheliya O cheliyaa..

:::2

nee kaipu kaLLatO nee kOnTE navvutO..gaaraDi chEsaavU
bhalE..bhalE..nee tiipimaaTalU neeLLallOmooTalU ninninka nammanOyii 
naa silakaa..hOy hOy..nee alakaa..hOy hOy..techchindilE andam 
naa kaLLu chUDavE ii bomma aaDavE..manasanta neevElE..E..
pO pOvOy..Oy pillOy..killaaDichaalulE..

hOy..bOngaraala buggalunnadaanaa..
nee kongu tagili pongipOti jaaNaa..hOy hOy
neev khassumanTE taaLalEnE..hOy..nee pondukOrivachchinaanE
haay..haay..O cheliya O cheliya O cheliyaa..

:::3

muchchaTlu gaalitO muripaalu poolatO..naTanalu naatOnaa
sarasaala sukkatO saradaalu mabbutO..saiyyaaTa naatOnaa 
iTu sooDavE,,hOy hOy..neetODulE..haay haay..
daasuDu neevaaDE..E..neevunTE pakkanaa..manasentO challanaa naaraaNi neevElE
O raajaa..naarOjaa..ii rOju haay..haay..

O ungaraala mungurula raaja nee hangu chUsi mOsapOnu lEra
naa saamiranga danDamOyii..hOy..naa jOlikinka raakOyii
haay..haay..O sinnODa O sinnODa O sinnODaa.

aa aa aa aa aa..O O O O hOy
aa aa aa aa aa..O O O O hOy
aa aa aa aa aa..O O O O hOy
aa aa aa aa aa..O O O O hOy
aa balE balE balE..aa balE balE balE
hOy.........yyaa...

Wednesday, April 07, 2010

తులాభారం--1974::చక్రవాకం::రాగం























సంగీతం::సత్యం 
రచన::రాజశ్రీ 
గానం::P.సుశీల 
తారాగణం::చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి 

రాగం::చక్రవాకం

పల్లవి::

ఆఆఆఆఆ..ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..ఆఆఆఆ 
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం 
రాధా హృదయం..మాధవ నిలయం 
రాధా హృదయం..మాధవ నిలయం 
ప్రేమకు దేవాలయం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
ఈ రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం  

చరణం::1

నీ ప్రియ వదనం..వికసిత జలజం 
నీ దరహాసం..జాబిలి కిరణం 
నీ ప్రియ వదనం..వికసిత జలజం 
నీ దరహాసం..జాబిలి కిరణం 
నీ శుభ చరణం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్  
నీ శుభ చరణం..ఈ రాధకు శరణం 
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం

చరణం::2

బృందావనికి..అందము నీవే 
రాసక్రీడకు..సారధి నీవే 
బృందావనికి..అందము నీవే 
రాసక్రీడకు..సారధి నీవే 
యమునా తీరం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
యమునా తీరం..రాగాల సారం 
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం 


Monday, April 05, 2010

విప్రనారాయణ--1954:::సింధుబైరవి:::రాగం







సంగీతం::S.రాజేశ్వరరావు 
రచన::సముద్రాల 
గానం::భానుమతి 
నిర్మాతలు:భానుమతి,రామకృష్ణరావు
దర్శకత్వం::రామకృష్ణారావు
తారాగణం::భానుమతి,నాగేశ్వరరావు

సింధుబైరవి:::రాగం 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా

చరణం::1

వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం
వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం
నిన్నేలువాని లీలలేరా
నిన్నేలువాని లీలలేరా
కన్నార కనరా ఏలుకోరా
కన్నార కనరా ఏలుకోరా

ఓ ఓ ఓ ఓ ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా

చరణం::2

అందరాని విందుపైన ఆశలేలా
అందరాని విందుపైన ఆశలేలా
పొందుదుకోరు చిన్నదాని పొందనేలా
అందాలరాయా అందరారా
అందాలరాయా అందరారా
అనందమిదియే అందుకోరా
అనందమిదియే అందుకోరా

ఓ ఓ ఓ ఓ ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా

Sunday, April 04, 2010

దేవత--1965



సంగీతం::S.P.కోదండపాణి
రచన:: కొసరాజు
గానం::పద్మనాభం , L. R. ఈశ్వరి  
Film Directed By::K.HemaambharadhgaraRao 
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి

పల్లవి:: 

మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
మథనపడి మనసుచెడి వచ్చానే అమ్మాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు

మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
ఏమిటి నీగాథ ఏమాత్రం నీహోదా
ఏమిటి నీగాథ ఏమాత్రం నీహోదా
ఆ విషయం ఆ వివరం చెప్పవోయి అబ్బాయి
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి

చరణం::1

రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకులో డబ్బులున్నాయ్
రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకులో డబ్బులున్నాయ్
దేవుడిచ్చిన కాళ్ళున్నాయ్ చూడ్డానికి కళ్ళున్నాయ్
మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
క్యాడిలా కారుందా న్యూ మోడల్ మేడుందా
క్యాడిలా కారుందా న్యూ మోడల్ మేడుందా
ఇంటిముందు లానుందా నిదురబోను ఫ్యానుందా
కాఫీలకు సినిమాలకు కరువేమీ లేదుకదా
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు

చరణం::2

ఊరు తిరగ బస్సుంది ప..పాయ్ ప..పాయ్
ఉండను ప్లాట్ఫారముంది
ఊరు తిరగ బస్సుంది..ఉండను ప్లాట్ఫారముంది
కడుపునిండా నీరుత్రాగ కార్పొరేషన్ టాపుంది
ఏమున్నా లేకున్నా..ఏమున్నా లేకున్నా
మిన్నయైనదొకటుంది..మిన్నయైనదొకటుంది
ఏముంది ప్రేమించే హృదయముంది
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి..అహా
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి
హ్యాపీగా తాపీగా..హ్యాపీగా తాపీగా
బ్రతుకు పరుగు తీయాలి..బ్రతుకు పరుగు తీయాలి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి

దాన వీర శూర కర్ణ--1977




సంగీతం::పెండ్యాల 
రచన::సినారె 
గానం::S.P.బాలు,P.సుశీల  
Film Directed By::N.T.Raamaa Rao
తారాగణం::N.T.రామారావు,హరికృష్ణ,N.బాలకృష్ణ,నందమూరి హరికృష్ణ, గుమ్మడి, ముక్కామల,కైకాల  సత్యనారాయణ,ధుళిపాళ,M.ప్రభాకర్‌రెడ్డి,మిక్కిలినేని రాధాకృష్ణ,కాంచన,S.వరలక్ష్మిB.సరోజినీదేవి,శారద,ప్రభ.

పల్లవి:: 

చిత్రం..ఆయ్ భళారే చిత్రం
చిత్రం..అయ్యారే చిత్రం 
నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం 
పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటేవి చిత్రం 
చిత్రం..అయ్యారే చిత్రం 
హ..హ..చిత్రం..ఆయ్ భళారే విచిత్రం

చరణం::1

రాచరికపు జిత్తులతో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 
రణతంత్రపుటెత్తులతో..ఓ..ఓహో..ఓ.. 
రాచరికపు జిత్తులతో..రణతంత్రపుటెత్తులతో 
సదమదమవు మామదిలో..మదనుడు సందడి సేయుట చిత్రం 
ఆయ్ భళారే విచిత్రం.. 

ఎంతటి మహరాజయినా..ఆ హా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
ఎంతటి మహరాజయినా..ఎప్పుడో ఏకాంతంలో 
ఎంతో కొంత తన కాంతను..స్మరించుటే సృష్టిలోని చిత్రం 
ఆయ్..భళారే విచిత్రం..అయ్యారేవి చిత్రం 

చరణం::2

బింభాధర మధురిమలూ..ఊ..ఊ..ఊ 
బిగికౌగిలి ఘుమఘ్మలూ..ఊ..ఆ..ఆ..ఆహా..ఆ 
బింభాధర మధురిమలు..బిగికౌగిలి ఘుమఘుమలు 
ఇన్నాళ్ళుగా మాయురే..మేమెరుగకపోవటే..చిత్రం
ఆయ్ భళారేవి చిత్రం.

ఆ..ఆ..ఆఆఆ..హా..హా..హ..హ..ఆ 
వలపెరుగని వాడననీ..ఈ..ఈ..ఈ..ఈ 
వలపెరుగని వాడననీ..పలికిన ఈ రసికమణి 

తొలిసారే ఇన్ని కలలు కురిపించుట..అహ హవ్వా  
నమ్మలేని చిత్రం..మూ..అయ్యారే విచిత్రం 
ఆయ్..భళారే విచిత్రం..అయ్యారే విచిత్రం
అయ్యారే విచిత్రం..మూ అయ్యారే విచిత్రం

Daanaveera Soora Karna
Music::Pendyala
Lyrics::D.C.Naaraayana Reddi
Singer::S.P.Baalu.P.Suseela
Film Directed By::N.T.Raamaa Rao
Cast::N.T.Raamaa Rao,N.Harikrishna,N.Baalakrishna,Gummadi,Kaikaala Satyanarayana,Mukkaamala,M.Prabhaakar Reddi,Dhilipaala,Mikkilineni Raadhakrishna,Kaanchana,S.Varalakshmii,B.Sarojinidevi,Prabha,Saarada.

::::::::::::::::::::::::::::::

chitram..aay bhaLaarE chitram
chitram..ayyaarE chitram 
nee raachanagaraku raaraajunu rappinchuTE vichitram
piluvakanE priyavibhuDE vichchEyuTEvi chitram 
chitram..ayyaarE chitram 
ha..ha..chitram..aay bhaLaarE vichitram

::::1

raacharikapu jittulatO..O..O..O..O..O.. 
raNatantrapu TettulatO..O..OhO..O.. 
raacharikapu jittulatO..raNatantrapu TettulatO 
sadamadamavu maa madilO..madanuDu sandaDi sEyuTa chitram 
aay bhaLaarE vichitram..mm 

entaTi maharaajayinaa..aa haa..aa..aa..aa..aa..aa 
entaTi maharaajayinaa..eppuDO EkaantamlO 
entO konta tana kaantanu..smarinchuTE sRshTilOni chitram 
aay..bhaLaarE vichitram..ayyaarEvi chitram 

::::2

bimbhaadhara madhurimaluu..uu..uu..uu 
bigikaugili ghumaghmaluu..uu..aa..aa..aahaa..aa 
bimbhaadhara madhurimalu..bigikaugili ghumaghumalu 
innaaLLugaa maayurE..mEmerugakapOvaTE..chitram
aay bhaLaarEvi chitram.

aa..aa..aaaaaa..haa..haa..ha..ha..aa 
valaperugani vaaDananii..ii..ii..ii..ii 
valaperugani vaaDananii..palikina ii rasikamaNi 

tolisaarE inni kalalu kuripinchuTa..aha havvaa  
nammalEni chitram..mm uu..ayyaarE vichitram
aay..bhaLaarE vichitram..ayyaarE vichitram

ayyaarE vichitram..mm uu..ayyaarE vichitram