Saturday, April 10, 2010

పండంటి కాపురం--1972

















సంగీతం::S.P.కోదండపాణి
రచన::మైలవరపు గోపి
గానం::S.P.కోదండపాణి, P.సుశీల
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, జమున, ప్రభాకరరెడ్డి,B.సరోజాదేవి,
జయసుధ, S.V.రంగారావు, రాజబాబు,  

పల్లవి:: 

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు 
బంధాలేమో పదివేలు 

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు 
బంధాలేమో పదివేలు

చరణం::1 

నదిలో నావ ఈ బ్రతుకు
దైవం నడుపును తన బసకు
ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
నదిలో నావ ఈ బ్రతుకు
దైవం నడుపును తన బసకు
అనుబంధాలు ఆనందాలు 
తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు 
బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

చరణం::2 

రాగం ద్వేషం రంగులురా
భోగం భాగ్యం తళుకేరా
ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
రాగం ద్వేషం రంగులురా
భోగం భాగ్యం తళుకేరా
కునికే దీపం తొణికే ప్రాణం
నిలిచేకాలం తెలియదురా
నిలిచేకాలం తెలియదురా

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు 
బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

No comments: