సంగీతం::K.V.మహాదేవన్ గారు
రచన::ఆత్రేయ గారు
గానం::S.P.బాలు
తారాగణం::వినయ్ కుమార్, ఉమా భారతి
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పాడాలనే ఉన్నది..విని మెచ్చి
మనసిచ్చే..మనిషుంటే
పాడాలనే ఉన్నది..విని మెచ్చి
మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది
చరణం::1
పాడాలంటే హృదయం ఉండాలి
పాడాలంటే హృదయం ఉండాలి
హృదయానికి ఏదో కదలిక రావాలి
పాడాలంటే హృదయం ఉండాలి
హృదయానికి ఏదో కదలిక రావాలి
భావం పొంగాలి..రాగం పలకాలి
దానికి జీవం పోయాలి
భావం పొంగాలి..రాగం పలకాలి
దానికి జీవం పోయాలి
పాడాలనే ఉన్నది..విని మెచ్చి
మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది
చరణం::2
పాడానంటే..రాళ్ళే కరగాలి
ఆ రాళ్ళకు నోళ్ళోచ్చి..కథలే చెప్పాలి
పాడానంటే..రాళ్ళే కరగాలి
ఆ రాళ్ళకు నోళ్ళోచ్చి..కథలే చెప్పాలి
ముసుగులు తొలగాలి..మసకలు పోవాలి
గదిలో దేవత కనుతెరవాలి..పాడాలనే ఉన్నది
ముసుగులు తొలగాలి..మసకలు పోవాలి
గదిలో దేవత కనుతెరవాలి..పాడాలనే ఉన్నది
పాడాలనే ఉన్నది..విని మెచ్చి
మనసిచ్చే మనిషుంటే..పాడాలనే ఉన్నది..ఈ..
No comments:
Post a Comment