Wednesday, April 28, 2010

ఏదిపాపం - ఏది పుణ్యం--1979




సంగీతం::సత్యం
రచన::మైలవరపుగోపి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

కాలమిలా ఆగిపోని..కలనిజమై సాగిపోని
అన్నిమరచి ఈ నిముషంలో..నీ ఒడిలోనే నిదురపోనీ

కాలమిలా ఆగిపోని కలనిజమై సాగిపోని
అన్నిమరచి ఈ నిముషంలో..నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ......

చరణం::1

తొలిసంజె మలిసంజె లేలా..నా చెంత చెలి ఉన్నవేళ
తొలిసంజె మలిసంజె లేలా..నా చెంత చెలి ఉన్నవేళ
చిరుగాలి సెలఏరు లేలా..నా మనషి తోడున్న వేళ
అనువైన వేళా..ఈ శుభవేళా
బ్రతుకే వెన్నెల వేళా..వేళా..వేళా...

కాలమిలా ఆగిపోనీ,,కలనిజమై సాగిపోనీ
అన్నీమరచి...ఆ ఆ..
ఈ నిముషంలో..ఆ ఆ..
నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ.......

చరణం::2

సిరిదివ్యలో వెలుగులాగా..నీచూపులో నిలిచిపోనీ
సిరిదివ్యలో వెలుగులాగా..నీచూపులో నిలిచిపోనీ
జేగంటలో రవళి లాగా..నీ ఊపిరై కలసిపోనీ..
కలలే గానీ..కలతే లేనీ
లోకానికే చేరిపోనీ..చేరిపోనీ..చేరిపోనీ..

కాలమిలా ఆగిపోనీ..కలనిజమై సాగిపోనీ
అన్నీమరచీ..ఆ ఆ
ఈ నిముషంలో..ఆ ఆ
నీ ఒడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ

No comments: