సంగీతం::సత్యం రచన::రాజశ్రీ గానం::P.సుశీల,S.P.బాలు తారాగణం::చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి పల్లవి:: ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా నువ్వేడుంటే అది నా వూరే..నువ్వేదంటే అది నా పేరే ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా చరణం::1 అన్నెం పున్నెం తెలియదు..నీ కని అనుకున్నా నొకనాడు అన్నీ తెలిసిన గడసరి నువ్వని..తెలిసెను నాకీనాడు నాటకం ఆడేవులే..నా మనసంతా దోచేవులే ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా చరణం::2 చిలిపిగ నవ్వే కాటుక కళ్ళూ..చిలికెను వలపుల జల్లు కులుకూ పలుకూ పొగరూ వగరూ..ముంగాళ్ళకు బంధాలూ ఉండనీ నీ గుండేలో..ఏడడుగులు నీతో నడవనీ ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా చరణం::3 పారే ఏరూ వీచే గాలి..ఏమంటుందో చూడు నింగీ నేలా నిలిచేదాకా..నువ్వే నాకు తోడు చేతిలో చెయి వెయ్యానీ..ప్రతి పగలూ వెన్నెల చూడనీ ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా నువ్వేడుంటే అది నా వూరే..నువ్వేదంటే అది నా పేరే ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా ఏందేహె నీ కత చిన్నోడా..ఎందుకు నీకెహె చినదానా ఏందేహె నీ కత చిన్నోడా..ఎందుకు నీకెహె చినదానా
సంగీతం::సత్యం రచన::ఆత్రేయ గానం::P.సుశీల తారాగణం::చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి పల్లవి:: ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు..అందరు నా చుట్టాలు ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు..అందరు నా చుట్టాలు ఈ ఊరే నా యిల్లు.. చరణం::1 కుమ్మరి సారెలు గిర గిర తిరగాలీ కమ్మరి కొలిమి కణ కణ లాడాలి..ఓయ్ కుమ్మరి సారెలు గిర గిర తిరగాలీ కమ్మరి కొలిమి కణ కణ లాడాలి ముత్తైదువలూ ముగ్గులు వెయ్యాలీ ముత్తైదువలూ ముగ్గులు వెయ్యాలీ యింటింట పండుగలే..ఓయ్ ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు చరణం::2 గోమాత భూమాత మముగన్న మా తల్లులు ఓయ్..రైతన్న కూలన్న మా అన్నదమ్ముళ్ళు కొండలు కోనల్లు గోదారి పరవళ్ళు కొండలు కోనల్లు గోదారి పరవళ్ళు కనిపించు దేవుళ్ళు..ఓయ్ ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు నా చుట్టాలు ఈ ఊరే నా యిల్లు..ఊరంతా నా వాళ్ళు
సంగీతం::సత్యం రచన::ఆరుద్ర గానం::P.సుశీల,S.P.బాలు తారాగణం::చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి పల్లవి:: చేరువలోనే దూరములేలా రాధమ్మా..నా చెంత రావేలనే రాధమ్మా..ఈ చింత నీ కోసమే దూరములోనే చేరువ వుంది ఓ రాజా..ఉన్నాను నీ నీడగా ఓ రాజా..ఉంటాను నీ తోడుగా చరణం::1 విరహాలు నన్ను..దహియించు వేళ కురిపించవేల..అనురాగ ధార విరహాలు నన్ను..దహియించు వేళ కురిపించవేల..అనురాగ ధార కులుకుల చినుకులె..పన్నీటి జల్లు రాధమ్మా..నా చెంత రావేలనే రాధమ్మా..ఈ చింత నీ కోసమే దూరములోనే చేరువ వుంది ఓ రాజా..ఉన్నాను నీ నీడగా ఓ రాజా..ఉంటాను నీ తోడుగా చరణం::2 ఆనాటి నుంచీ..నీ దాననేగా ఈనాడు నీలో..ఈ తొందరేలా ఆనాటి నుంచీ..నీ దాననేగా ఈనాడు నీలో..ఈ తొందరేలా మనసున మమతలు..నీ పూజకేలే ఓ రాజా..ఉన్నాను నీ నీడగా ఓ రాజా..ఉంటాను నీ తోడుగా చేరువలోనే దూరములేలా రాధమ్మా..నా చెంత రావేలనే రాధమ్మా..ఈ చింత నీ కోసమే ఓ రాజా..ఉంటాను నీ తోడుగా