సంగీతం::S.P.కోదండపాణి
రచన:: కొసరాజు
గానం::పద్మనాభం , L. R. ఈశ్వరి
Film Directed By::K.HemaambharadhgaraRao
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి.
పల్లవి::
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
మథనపడి మనసుచెడి వచ్చానే అమ్మాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
ఏమిటి నీగాథ ఏమాత్రం నీహోదా
ఏమిటి నీగాథ ఏమాత్రం నీహోదా
ఆ విషయం ఆ వివరం చెప్పవోయి అబ్బాయి
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
చరణం::1
రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకులో డబ్బులున్నాయ్
రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకులో డబ్బులున్నాయ్
దేవుడిచ్చిన కాళ్ళున్నాయ్ చూడ్డానికి కళ్ళున్నాయ్
మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
క్యాడిలా కారుందా న్యూ మోడల్ మేడుందా
క్యాడిలా కారుందా న్యూ మోడల్ మేడుందా
ఇంటిముందు లానుందా నిదురబోను ఫ్యానుందా
కాఫీలకు సినిమాలకు కరువేమీ లేదుకదా
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
చరణం::2
ఊరు తిరగ బస్సుంది ప..పాయ్ ప..పాయ్
ఉండను ప్లాట్ఫారముంది
ఊరు తిరగ బస్సుంది..ఉండను ప్లాట్ఫారముంది
కడుపునిండా నీరుత్రాగ కార్పొరేషన్ టాపుంది
ఏమున్నా లేకున్నా..ఏమున్నా లేకున్నా
మిన్నయైనదొకటుంది..మిన్నయైనదొకటుంది
ఏముంది ప్రేమించే హృదయముంది
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి..అహా
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి
హ్యాపీగా తాపీగా..హ్యాపీగా తాపీగా
బ్రతుకు పరుగు తీయాలి..బ్రతుకు పరుగు తీయాలి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
No comments:
Post a Comment