సంగీత::T.G.లింగప్ప రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు (త్రిపాత్రాభినయం), నాగయ్య, జయంతి,పద్మనాభం, రావి కొండలరావు. పల్లవి:: ఎన్ని కలలు..కన్నానురా ఎన్నెన్ని కలలు..కన్నానురా నిన్ను చూడగా..నిలువెల్ల కనులుగా నిన్ను చూడగా..నిలువెల్ల కనులుగా ఇన్నాళ్ళుగా వేచి..ఉన్నానురా ఎన్ని కలలు..కన్నానురా చరణం::1 ఏ రూపమని నిన్ను..కొలిచేనురా ఏ పేరునా నిన్ను..పిలిచేనురా ఓ స్వామీ..ఊ..నా స్వామి..ఊహూ పలుకే తెలుపగ..జాలనురా నా..వలపే నిలుపగ జాలనురా బేలనురా..ముగ్దరాలనురా నా కలలన్ని..కానుక చేసేనురా ఎన్ని కలలు..కన్నానురా చరణం::2 జానకి మనసున..చల్లగ వెలసిన రామయ్యగా నిన్ను..ఊహింతునా రాధిక బ్రతుకునా..మాధురి నింపిన కృష్ణయ్యవీ అని..భావింతునా అలివేలు మంగమ్మ..అల్లారు మగడైన ఆ స్వామి వెంకన్న..వనుకుందునా ఆ స్వాములను మించు..అనుభూతినందించు నా స్వామి నీవని..పులకింతునా ఓ స్వామీ..ఊ..నా స్వామి..ఊహూ పలుకే తెలుపగ..జాలనురా నా వలపే నిలుపగ..జాలనురా బేలనురా..ముగ్దరాలనురా నా బ్రతుకే కానుక..చేసేనురా ఎన్ని కలలు..కన్నానురా ఎన్నెన్ని కలలు..కన్నానురా
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే ఎవరెంత చేసుకుంటే..ఎవరెంత చేసుకుంటే..అంతే కాదా దక్కేది
నవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటె వల వల..
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా ఆ అ ఆ ఆ అ ఆ అ ఆ ఆ అ ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ చేతకానమ్మకే చేష్టలెక్కువ చెల్లని రూపాయికే గీతలెక్కువా
సంగీతం::S.రాజేశ్వరరావు రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం::P.సుశీల Film Directed By::K.S.R.Daas తారాగణం::కృష్ణ,జయప్రద,పండరీబాయ్,నాగభుషణం,అల్లురామలింగయ్య,సాక్షీరంగారావు,సత్తేంద్రకుమార్ M.బాలయ్య,జయలక్ష్మి,ఝాన్సీ,రాధాకుమారి,లక్ష్మీకాంతమ్మ,సావిత్రి,భానుమతి,పుష్ప,సరోజ. బిలహరి::రాగం ( Bilahari::Rag) పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఎవరు నేర్పేరమ్మ..ఈ కొమ్మకు పూలిమ్మ నీ రెమ్మ..రెమ్మకు ఎవరు నేర్పేరమ్మ..ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ..రెమ్మకు ఎంత తొందరలే..హరి పూజకు ప్రొద్దు పొడవకముందే..పూలిమ్మనీ ఎవరు నేర్పేరమ్మ..ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ..రెమ్మకు చరణం::1 కొలువైతివా..దేవి నాకోసము కొలువైతివా..దేవి నాకోసము తులసీ..తులసీ దయాపూర్ణకలశీ కొలువైతివా దేవి..నాకోసము తులసీ..తులసీ దయాపూర్ణకలశీ మల్లెలివి..నా తల్లి వరలక్ష్మికి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మల్లెలివి..నా తల్లి వరలక్ష్మికి మొల్లలివి..నన్నేలు నా స్వామికి ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ చరణం::2 ఏ లీల సేవింతు..ఏమనుతు కీర్తింతు ఏ లీల సేవింతు..ఏమనుతు కీర్తింతు సీత మనసే..నీకు సింహాసనం ఒక పువ్వు పాదాల..ఒక దివ్వె నీ మ్రోల ఒక పువ్వు పాదాల..ఒక దివ్వె నీ మ్రోల ఒదిగి నీ ఎదుట ఇదే వందనం..ఇదే వందనం ఉం..ఉమ్..ఉమ్..ఉమ్..ఉమ్..ఉమ్..ఉమ్ Enaati Bandham Enatido--1977 Music::S.Rajeswara Rao Lyrics::M.Balayya Singer::P.suSeela Film Directed By::K.S.R.Daas Cast::Krishna,Jayaprada,Pandaribaay,Naagabhushanam,Alluraamalingayya,Saaksheerangaaraavu,sattendrakumaar^ M.Baalayya,Jayalakshmi,Jhaansee,Raadhaakumaari,Lakshmeekaantamma,Pushpa,Saroja. :::::::::::: aa aa aa aa aa aa aa aa aa aa aa evaru nErpEramma..ee kommaku poolimma nee remma..remmaku evaru nErpEramma..ee kommaku poolimmanee remma..remmaku enta tondaralE..hari poojaku proddu poDavakamundE..poolimmanee evaru nErpEramma..ee kommaku poolimmanee remma..remmaku ::::1 koluvaitivaa..dEvi naakOsamu koluvaitivaa..dEvi naakOsamu tulasee..tulasee dayaapoorNakalaSee koluvaitivaa dEvi..naakOsamu tulasee..tulasee dayaapoorNakalaSee mallelivi..naa talli varalakshmiki aa aa aa aa aa aa aa aa aa mallelivi..naa talli varalakshmiki mollalivi..nannElu naa swaamiki evaru nErpEramma ee kommaku poolimmanee remma remmaku enta tondaralE hari poojaku proddu poDavakamundE poolimmanee ::::2 E leela sEvintu..Emanutu keertintu E leela sEvintu..Emanutu keertintu seeta manasE..neeku simhaasanam oka puvvu paadaala..oka divve nee mrOla oka puvvu paadaala..oka divve nee mrOla odigi nee eduTa idE vandanam..idE vandanam um..umm..umm..umm..umm..umm..umm
సంగీతం::చక్రవర్తి రచన::అప్పలాచార్య గానం::L.R.అంజలి,పద్మనభం,చక్రవర్తి,కౌసల్య తారాగణం::కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి,రమాప్రభ,నిర్మల, హలం పల్లవి:: అన్నమో రామచంద్రా యటంచు..అలమటించు నాకు అదృష్టమున్ చాల కల్గించినావు..నీవే..ఏఏఏఏ..నీవే నాపాలి..భాగ్య..ఆఆఅ..రాశివి కప్పా..ఆ..కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా..ఆ..అందరికన్నా నువ్వే గొప్పా కప్పా జంతుజాలముల కన్న..జాతి పక్షులకన్న జంతుజాలముల కన్న..జాతి పక్షులకన్న గొప్పలు చెప్పే తప్పుడు మనుషులకన్నా..ఆఆఆ కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే చరణం::1 కరువు కాటకం..వచ్చినప్పుడు వేపమండ నీ కాలికి..కట్టీ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.ఓ ఓ ఓ ఓ కరువు కాటకం వచ్చినప్పుడు వేపమండ నీ కాలికి కట్టీ పల్లకిలో నిను..ఊరేగింతురు ఒహో ఒహో ఒహో ఒహో ఒహో ఒహో పల్లకిలో నిను ఊరేగింతురు వేడుకలెన్నో చేసేరూ..వానలకోసం ఏడ్చేరు కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే చరణం::2 మత్స్య కూర్మ నరసింహ వరాహ అవతారములను దాల్చిన దేవుడు దదరిననా దదరిననా నా దా నా దా నా దా మత్స్య కూర్మ నరసింహ వరాహ అవతారములను దాల్చిన దేవుడు నీ అవతారం ఎత్తుట మరచీ నీ అవతారం ఎత్తుట మరచీ ఎంతో ద్రోహం చేశాడు నీకు కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా ఓ కప్పా నా కప్పా కప్ప కప్ప కప్ప కప్ప కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
చరణం::3 నెమలిని ఎక్కెను కుమారస్వామి కుమారస్వామి ఎద్దును ఎక్కెను నీలకంఠుడు..నీలకంఠుడు కుక్కను కుక్కను కుక్కను ఎక్కెను వీరభద్రుడు ఎవరూ నిన్ను ఎక్కకపోవుట..చాలే.. ఎవరూ నిన్ను...ఎక్కకపోవుట చాలా తప్పు నిజమో..కాదో నీవే చెప్పు కుక్కా ఛీ ఐ యాం సారీ..కప్పా అందరికన్నా నువ్వే గొప్పా కప్పా ఓ కప్పా నా కప్పా..కప్ప కప్ప కప్ప కప్ప కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే కప్పహరే మహా గొప్పహరే చెప్పు హరే కథ చెప్పు హరే
సంగీత::పెండ్యాల రచన::ఆత్రేయ గానం::P.సుశీల తారాగణం::శోభన్‌బాబు,లక్ష్మి,చంద్రకళ,ఆత్రేయ,జగ్గయ్య,చంద్రమోహన్,సూర్యకాంతం,నిర్మల, పల్లవి:: కథ విందువా..నా కథ విందువా విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా..నా కథ విందువా చరణం::1 బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు అన్న అనుమాటతో అన్ని తుంచేశావు పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి ఉరితాడు నా మెడకు వేయించినావు కథ విందువా..నా కథ విందువా చరణం::2 తొలిరేయి విరిపానుపు..ముళ్ళనే పరిచింది తొలిరేయి విరిపానుపు..ముళ్ళనే పరిచింది కసటు కోరిక మగని..రూపాన నిలిచింది నీ పేరు మెదలిన..మధురాధరము పైన చిరుచేదు చిలికింది..జీవితమె మారింది చిరుచేదు చిలికింది..జీవితమె మారింది కథ విందువా..నా కథ విందువా విథికి బదులుగ నువ్వు..నా నుదుట వ్రాసిన కథ విందువా..నా కథ విందువా చరణం::3 శీలాన్ని ఏలమున..పెట్టింది స్వార్థము శీలాన్ని ఏలమున..పెట్టింది స్వార్థము తాళినే ఎగతాళి..చేసింది ధనము కాముకుల కాహుతై..పోయింది మానము నా పాలి నరకమై..మిగిలింది ప్రాణము నా పాలి నరకమై..మిగిలింది ప్రాణము కథ విందువా..నా కథ విందువా విథికి బదులుగ నువ్వు..నా నుదుట వ్రాసిన కథ విందువా..నా కథ విందువా
సంగీత::పెండ్యాల రచన::మల్లెమాల గానం::ఘంటసాల తారాగణం::శోభన్‌బాబు, లక్ష్మి, చంద్రకళ, ఆత్రేయ, జగ్గయ్య,చంద్రమోహన్,సూర్యకాంతం,నిర్మల పల్లవి:: ఇదే చంద్రగిరి..ఈఈఈఈఈఈ శౌర్యానికి గీచిన గిరి.. ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి..ఇదే చంద్రగిరి ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి..ఇదే చంద్రగిరి చరణం::1 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ లలలలల లలలలల లలలలలా తెలుగుజాతి చరితలోన..చిరిగిపోని కీర్తి సిరి చిరిగిపోని కీర్తి సిరి..తెలుగు నెత్తురుడికించిన వైరులకిది..మృత్యువు దరి ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి..ఇదే చంద్రగిరి చరణం::2 తిరుమల శ్రీ వేంకటేశు..చిర దరిశన వాంఛతో తిరుమల శ్రీ వేంకటేశు..చిర దరిశన వాంఛతో ఇమ్మడి నరసింహుడు..నిర్మించిన దుర్గము ఇమ్మడి నరసింహుడు..నిర్మించిన దుర్గము ఆంధ్రశిల్పి పనితనానికద్భుత తార్కాణముగా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆంధ్రశిల్పి పనితనానికద్భుత తార్కాణముగా వెలసిన దిట స్వర్గము..వెయ్యేళ్ళకు పూర్వము వెయ్యేళ్ళకు..పూర్వము ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి..ఇదే చంద్రగిరి చరణం::3 ఇక్కడే తిమ్మరుసు..చదివి ఎదిగినాడు ఇక్కడే తిమ్మరుసు..చదివి ఎదిగినాడు రాజనీతి రాటుదేలి..రాయల గురివై నాడు రాజనీతి రాటుదేలి..రాయల గురివై నాడు ఈ మహలే కవి గాయక పండిత జన మండల మొకనాడు ఈ శిధిలాలే గత వైభవ..చిహ్నములై మిగిలిన వీనాడు గత వైభవ చిహ్నములై..మిగిలిన వీనాడు..ఈనాడు