సంగీత::T.చలపతిరావు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::అక్కినేని, జమున,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు
పల్లవి::
హరీల రంగ అనవలెరా..చెప్పినది వినవలెరా
ఎందుకని అడగకురా..ముందుగతి కనవలెరా
హరీల రంగ అనవలెరా..చెప్పినది వినవలెరా
మన గురువుల బోధలు
విననివారికి..ముక్తిలేదు గదరా..ఆ
హరీల రంగ అనవలెరా..చెప్పినది వినవలెరా
హరీల రంగ అనవలెరా..చెప్పినది వినవలెరా
హరీల రంగ అనవలెరా..చెప్పినది వినవలెరా
చరణం::1
అమృతం తాగిన దేవతలు..చావన్నది
లేకున్నారు జలసాలో..మునిగున్నారు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
అమృతం తాగిన దేవతలు..చావన్నది
లేకున్నారు జలసాలో..మునిగున్నారు
మాయా దేహం వున్న మానవులు
మమతలలో పడివున్నారు
మట్టి బొమ్మలుగ వున్నారు
శివ..శివ..శివ..శివ..ఆ
హరీల రంగ అనవలెరా చెప్పినది వినవలెరా
హరీల రంగ అనవలెరా చెప్పినది వినవలెరా
హరీల రంగ అనవలెరా చెప్పినది వినవలెరా
చరణం::2
నువ్వూ నేను నాస్తి..నీ వెంబడిరాదీ ఆస్తి
వున్నంతవరకేరా..యీ గస్తీ
నువ్వూ నేను నాస్తి..నీ వెంబడిరాదీ ఆస్తి
వున్నంతవరకేరా..యీ గస్తీ
పరుల దోచి నువు దాచిన ధనము
ఎంతో కాలము నిలువదురా పోయేటప్పుడు తెలియదురా
శివ..శివ..శివ..శివ
హరీల రంగ అనవలెరా చెప్పినది వినవలెరా
చరణం::3
వెయ్యకురా మాయ వేషాలు..చెయ్యకురా పాడు మోసాలు
చాలించరా చిద్విలాసాలు
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
వెయ్యకురా మాయ వేషాలు..చెయ్యకురా పాడు మోసాలు
చాలించరా చిద్విలాసాలు
తిన్నయింటి వాసాల నెన్నితే..చిత్రగుప్తుడు చూస్తాడు
యముడు తోలు..ఒలిచేస్తాడు
శివ..శివ..శివ..శివ..శివ..శివ..ఆ
హరీల రంగ అనవలెరా చెప్పినది వినవలెరా
హరీల రంగ హరీ హరీల రంగ హరీ
హరీల రంగ హరీ హరీల రంగ హరీ
హరీ హరీ హరీ హరీ ఓం శివ..శివ..ఆ
No comments:
Post a Comment