Friday, November 18, 2011

కులగౌరవం--1972


















సంగీత::T.G.లింగప్ప
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు (త్రిపాత్రాభినయం), నాగయ్య, జయంతి,పద్మనాభం,
రావి కొండలరావు.

పల్లవి::

ఎన్ని కలలు..కన్నానురా
ఎన్నెన్ని కలలు..కన్నానురా
నిన్ను చూడగా..నిలువెల్ల కనులుగా
నిన్ను చూడగా..నిలువెల్ల కనులుగా
ఇన్నాళ్ళుగా వేచి..ఉన్నానురా
ఎన్ని కలలు..కన్నానురా 

చరణం::1

ఏ రూపమని నిన్ను..కొలిచేనురా
ఏ పేరునా నిన్ను..పిలిచేనురా
ఓ స్వామీ..ఊ..నా స్వామి..ఊహూ
పలుకే తెలుపగ..జాలనురా
నా..వలపే నిలుపగ జాలనురా
బేలనురా..ముగ్దరాలనురా
నా కలలన్ని..కానుక చేసేనురా
ఎన్ని కలలు..కన్నానురా 

చరణం::2

జానకి మనసున..చల్లగ వెలసిన 
రామయ్యగా నిన్ను..ఊహింతునా
రాధిక బ్రతుకునా..మాధురి నింపిన
కృష్ణయ్యవీ అని..భావింతునా
అలివేలు మంగమ్మ..అల్లారు మగడైన
ఆ స్వామి వెంకన్న..వనుకుందునా 
ఆ స్వాములను మించు..అనుభూతినందించు
నా స్వామి నీవని..పులకింతునా
ఓ స్వామీ..ఊ..నా స్వామి..ఊహూ
పలుకే తెలుపగ..జాలనురా
నా వలపే నిలుపగ..జాలనురా
బేలనురా..ముగ్దరాలనురా
నా బ్రతుకే కానుక..చేసేనురా 
ఎన్ని కలలు..కన్నానురా
ఎన్నెన్ని కలలు..కన్నానురా 

No comments: