సంగీత::పెండ్యాల
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,లక్ష్మి,చంద్రకళ,ఆత్రేయ,జగ్గయ్య,చంద్రమోహన్,సూర్యకాంతం,నిర్మల,
పల్లవి::
కథ విందువా..నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన
కథ విందువా..నా కథ విందువా
చరణం::1
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
అన్న అనుమాటతో అన్ని తుంచేశావు
పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి
ఉరితాడు నా మెడకు వేయించినావు
కథ విందువా..నా కథ విందువా
చరణం::2
తొలిరేయి విరిపానుపు..ముళ్ళనే పరిచింది
తొలిరేయి విరిపానుపు..ముళ్ళనే పరిచింది
కసటు కోరిక మగని..రూపాన నిలిచింది
నీ పేరు మెదలిన..మధురాధరము పైన
చిరుచేదు చిలికింది..జీవితమె మారింది
చిరుచేదు చిలికింది..జీవితమె మారింది
కథ విందువా..నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు..నా నుదుట వ్రాసిన
కథ విందువా..నా కథ విందువా
చరణం::3
శీలాన్ని ఏలమున..పెట్టింది స్వార్థము
శీలాన్ని ఏలమున..పెట్టింది స్వార్థము
తాళినే ఎగతాళి..చేసింది ధనము
కాముకుల కాహుతై..పోయింది మానము
నా పాలి నరకమై..మిగిలింది ప్రాణము
నా పాలి నరకమై..మిగిలింది ప్రాణము
కథ విందువా..నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు..నా నుదుట వ్రాసిన
కథ విందువా..నా కథ విందువా
No comments:
Post a Comment