సంగీత::పెండ్యాల
రచన::మల్లెమాల
గానం::ఘంటసాల
తారాగణం::శోభన్‌బాబు, లక్ష్మి, చంద్రకళ, ఆత్రేయ, జగ్గయ్య,చంద్రమోహన్,సూర్యకాంతం,నిర్మల
పల్లవి::
ఇదే చంద్రగిరి..ఈఈఈఈఈఈ
శౌర్యానికి గీచిన గిరి..
ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి..ఇదే చంద్రగిరి
ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి..ఇదే చంద్రగిరి
చరణం::1
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలలలల లలలలల లలలలలా
తెలుగుజాతి చరితలోన..చిరిగిపోని కీర్తి సిరి
చిరిగిపోని కీర్తి సిరి..తెలుగు నెత్తురుడికించిన
వైరులకిది..మృత్యువు దరి
ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి..ఇదే చంద్రగిరి
చరణం::2
తిరుమల శ్రీ వేంకటేశు..చిర దరిశన వాంఛతో
తిరుమల శ్రీ వేంకటేశు..చిర దరిశన వాంఛతో
ఇమ్మడి నరసింహుడు..నిర్మించిన దుర్గము
ఇమ్మడి నరసింహుడు..నిర్మించిన దుర్గము
ఆంధ్రశిల్పి పనితనానికద్భుత తార్కాణముగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆంధ్రశిల్పి పనితనానికద్భుత తార్కాణముగా
వెలసిన దిట స్వర్గము..వెయ్యేళ్ళకు పూర్వము
వెయ్యేళ్ళకు..పూర్వము
ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి..ఇదే చంద్రగిరి
చరణం::3
ఇక్కడే తిమ్మరుసు..చదివి ఎదిగినాడు
ఇక్కడే తిమ్మరుసు..చదివి ఎదిగినాడు
రాజనీతి రాటుదేలి..రాయల గురివై నాడు
రాజనీతి రాటుదేలి..రాయల గురివై నాడు
ఈ మహలే కవి గాయక పండిత జన మండల మొకనాడు
ఈ శిధిలాలే గత వైభవ..చిహ్నములై మిగిలిన వీనాడు
గత వైభవ చిహ్నములై..మిగిలిన వీనాడు..ఈనాడు
1 comment:
ఈ చిత్రంలోని అన్నీ వీడియో పాటలను ఇక్కడ వీక్షించండి.
https://www.youtube.com/playlist?list=PLMWZNMZrl8xfL96mw3bRoTrOZoYpafHsq
ధన్యవాదాలు.
Post a Comment