చిమ్మటలోని ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::ఘంటసాల
రచ్న::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు
పల్లవి::
ఏమండి లేతబుగ్గల లాయర్ గారూ
ఎందుకండి ఇంతలోనే కంగారూ
ఏమండి లేతబుగ్గల లాయర్ గారూ
ఎందుకండి ఇంతలోనే కంగారూ
అయ్యోరామా అయ్యోరామా..అయ్యోరామా అయ్యోరామా
హోయ్ గుళ్ళో నీ మాటవింటె అమ్మాయిగారూ
గుండెల్లో గుబులేసింది బొమ్మైగారూ
అయ్యోరామా అయ్యోరామా..అయ్యోరామా అయ్యోరామా
చరణం::1
పిల్లాపాపా కలగాలనీ..చల్లని దీవెన వినలేదా
పిల్లాపాపా కలగాలనీ..చల్లని దీవెన వినలేదా
ఆ దీవెన వింటూ అవునంటూ..కోయిలగంటలు అనలేదా
పిల్లలు వద్దంటానా..ఈ పిల్లను కాదంటానా
ఆ పెళ్ళికానిదే ఎలాగనీ..తల్లక్రిదులౌతున్నానని
ఏమండి లేత బుగ్గల లాయర్గారూ..
ఎందుకమ్మ ఇంతలోనే కంగారూ
అయ్యోరామా..అయ్యోరామా..
అయ్యోరామా..అయ్యోరామా..
చరణం::2
మొన్నటి కలలో పిలిచావు..ముద్దులు ఇమ్మని అడిగావు
మరి తోడుగ సాగే ఈవేళా..ఆడపిల్లలా బెదిరేవు
ముద్దులు వద్దంటానా..ఆ ముచ్చట కాదంటానా
మన పెద్దలతీర్పు వినాలనీ..ఒద్దికగా వేచి ఉన్నాననీ
ఏమండి లేత బుగ్గల లాయర్గారూ..
ఎందుకమ్మ ఇంతలోనే కంగారూ
ఏమండి లేత బుగ్గల లాయర్గారూ..
ఎందుకమ్మ ఇంతలోనే కంగారూ
అయ్యోరామా..అయ్యోరామా..
అయ్యోరామా..అయ్యోరామా..
ఏమండి లేత బుగ్గల లాయర్గారూ..
ఎందుకమ్మ ఇంతలోనే కంగారూ
అయ్యోరామా..అయ్యోరామా..
అయ్యోరామా..అయ్యోరామా..
No comments:
Post a Comment