సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::N.T రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు
పల్లవి::
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు
గూడు విడిచి వేరైనారు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
చరణం::1
జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు

ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు..ఎలా భరించేరు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
చరణం::2
ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు
ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు
ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు
ఆ తలిదండ్రుల పంచారు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
No comments:
Post a Comment