సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల , బృందం
తారాగణం::N.T. రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు
పల్లవి::
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
చరణం::1
త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
చరణం::2
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు..వీర మాతలు
విప్లవ వీరులు..వీర మాతలు
ముద్దుబిడ్డలై మురిసే భూమి
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
చరణం::3
సహజీవనము సమభావనము సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా
సహజీవనము సమభావనము సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము..లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల
సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
No comments:
Post a Comment