Sunday, December 05, 2010

దేవదాసు--1953











సంగీతం::C.R.సుబ్బరామన్ 

రచన::సముద్రాల సీనియర్ 
గానం::ఘంటసాల 

నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు.

పల్లవి::

కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే..ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే
పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే..బ్రతుకింతేనులే 
పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే..బ్రతుకింతేనులే..ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే 

చరణం::1

ఎవియో మురిపాలెటకో పయనాలు..దైవాల నీమాలింతే
ఎవియో మురిపాలెటకో పయనాలు..దైవాల నీమాలింతే..వరమింతే
చివురించిన పూదీవే విరియగా..విరితావులు దూరాలై 
చనేనులే ప్రేమ ఇంతేలే..పరిణామమింతేలే

కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే

చరణం::2

నెరవేరని ఈ మమకారాలేమో..ఈ దూరభారాలేమో..ఓ ఓ
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో..హితవేమో
ఎది నేరని ప్రాయానా చనువునా..రవళించిన రాగమ్మే 
స్థిరమ్మౌ యోగమింతేలే..అనురాగమింతేలే 

కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే..ఇంతేనులే 



No comments: