సంగీతం::C.R.సుబ్బరామన్
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల,కె.రాణి
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు.
పల్లవి::
ఓ..హొహొ..ఓ..హో..ఓ..హొహొఓహో..
ఓ..హొహొ..ఓ..హో..ఓ..హొహొఓహో..
ఓ దేవదా..ఓ పార్వతీ
చదువు ఇదేనా..మనవాసి వదిలేసి
అసలు దొరల్లే..సూటుబూటా
ఓ దేవద..చదువు ఇదేనా మనవాసి వదిలేసి
అసలు దొరల్లే సూటుబూటా
ఓ దేవద..
చరణం::1
పల్లెటూరి పిల్లకు..ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము..పట్టుబడిందే
పల్లెటూరి పిల్లకు..ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము..పట్టుబడిందే
పసికూన సిసలైన జాణ అయ్యిందే..బాగు బాగు
పసికూన సిసలైన జాణ అయ్యిందే..బాగు బాగు
ఓ పార్వతీ
చరణం::2
ఉన్న తీరు మారినా..ఊరు మారినా
తమరు ఎన్నటికీ..పసివారేనోయ్
ఉన్న తీరు మారినా..ఊరు మారినా
తమరు ఎన్నటికీ..పసివారేనోయ్
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా..నిజమయ్యేనా
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా..నిజమయ్యేనా
ఓ పార్వతీ
చరణం::3
నా ఎదుటే నీ బడాయి?
జీవితమే ఓ లడాయి!
నా ఎదుటే నీ బడాయి?
జీవితమే ఓ లడాయి!
లడాయిలా సరే మనకు..జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు..జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా..ఉడుకూమోతా
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా..ఉడుకూమోతా
ఓ పిరికి పార్వతీ...
ఓ దుడుకు దేవద...
No comments:
Post a Comment