Monday, December 06, 2010

తల్లీ కొడుకులు--1973



సంగీత::G.K.వెంకటేష్
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల 

పల్లవి::

చిలకలాటి చినదానికి..అలక అందమూ
ఆ అలక తీరిపోగానే...అదే బంధమూ
జోలపాట పాడనా...ఓ పసిదానా
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా
జోలపాట పాడనా...ఓ పసిదానా
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా

చరణం::1

కోరి యెత్తుకుని...గుండెకు హత్తుకుని
కోరి యెత్తుకుని...గుండెకు హత్తుకుని
అలకతీరి పోయేలా..అలకతీరి పోయేలా ఆడించనా 
నిన్ను లాలించనా..ఓ పసిదానా నా చినదానా      
జోలపాట పాడనా...ఓ పసిదానా
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా

చరణం::2

పుట్టిన యీరోజు..పంతాలు మానుకుని 
నీలోని అనురాగం...పెంచుకో
పుట్టిన యీరోజు..పంతాలు మానుకుని 
నీలోని అనురాగం...పెంచుకో
చల్లనైన యీ రేయీ..చల్లనైన యీ రేయీ 
పోనీయకే వృధాకానీయకే..ఓ పసిదానా నా చినదానా        
జోలపాట పాడనా...ఓ పసిదానా
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా

చరణం::3

చేసిన నేరానికి..చెంపలు వేసుకుని
చేసిన నేరానికి..చెంపలు వేసుకుని
వెచ్చని కౌగిలిలో..వెచ్చని కౌగిలిలో వచ్చివాలిపోనా
నీ వలపు దోచుకోనా..ఓ చినదానా ఓ పిల్లదానా  
జోలపాట పాడనా...ఓ పసిదానా 
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా
ఓ చినదానా....నా చినదానా

No comments: