Monday, December 06, 2010

తల్లీ కొడుకులు--1973



సంగీత::G.K.వెంకటేష్
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల 

పల్లవి::

కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా 
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా  

చరణం::1

నెత్తురు చెమటగ పిండావమ్మా..నీ పాపలను బెంచావమ్మా
పెద్దకొడుకుపై నీ ఆశంతా..పేక మేడలా కూలిందమ్మా
పేక మేడలా కూలిందమ్మా
కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా 

చరణం::2

యెల్ల సుఖాలు నీ కందించి..తల్లి తమ్ముడు వెళ్ళిపాయారూ
నిన్ను వలచిన నీ యిల్లాలే..నిందలు నీపై మోపిందీ
నిందలు నీపై...మోపిందీ        
కలలెన్నో కన్నావయ్యా..కన్నీరే మిగిలిందయ్యా
విధిరాసిన రాతలకూ...తిరుగెన్నడు లేదయ్యా 

చరణం::2

అన్నా చెల్లెల అనురాగం..అయినవారికే అనుమానం
చీడపురుగులూ చేసిన పనికీ..గూడే చెదిరిపోయిందమ్మా
గూడే...చెదిరిపోయిందమ్మా      
కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా

No comments: