సంగీత::G.K.వెంకటేష్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల
పల్లవి::
హా హా హా....
ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడే మంటావూ..ఎలా వుందంటావూ
కత్తిలాంటమ్మాయీ..ఈ..మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటావూ..ఊఊఊఊ
చరణం::1
పచ్చగా..ఆ ఆ ఆ ఆ
పచ్చగా మెరిసె పరువం పదే పదే చూశానూ
పచ్చగా మెరిసె పరువం..పదే పదే చూశానూ
కైపురేపే నీ అందం..కైపురేపే నీ అందం
కళ్ళతో...తాగేశానూ
నా చేతి చలవతో..నీ ప్రాణం నిలిచిందీ
నా చేతి చలవతో..నీ ప్రాణం నిలిచిందీ
నీ లేత నవ్వుతో..నా ప్రాణం పోతుందీ
ఇప్పుడే మంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడేమంటాను..చిక్కుపడి పోయాను
పువ్వులా విరబూసీ..మొగ్గనై పోయానూ
ఇప్పుడేమంటాను..ఊఊఊఊ
చరణం::2
వెచ్చగా..ఆ ఆ ఆ ఆ
వెచ్చగా నువు..నిమురుతువుంటే
వేయి వీణలు...మ్రోగెనూ
వెచ్చగా నువు..నిమురుతువుంటే
వేయి వీణలు...మ్రోగెనూ
కొంటెగా నువు చూస్తుంటే..కొంటెగా నువు చూస్తుంటే
కోటి ఊహలు...మూగేనూ
ఈ పులకరింత ఈ పులకరింత..ఏనాడూ ఎరుగను
యీ మొదటివింత..ఏ..జన్మకూ మరువను
ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడేమంటాను..చిక్కుపడి పోయాను
కత్తిలాంటమ్మాయీ..ఈ..మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటానూ..ఊఊఊఊ
No comments:
Post a Comment