సంగీత::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::S.V. రంగారావు, రాజబాబు,అంజలీదేవి, విజయనిర్మల,సత్యనారాయణ,రమాప్రభ,రాజసులోచన .
పల్లవి::
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
యీ..ఈ..యింటికే..యీ..ఈ..యింటికే
కొత్త వెలుగు...వచ్చినరోజూ
యీనాడే బాబూ..నీ పుట్టినరోజూ
చరణం::1
చిన్నబాబు ఎదిగితె..కన్నావరి కానందం
నెలవంక పెరిగితె..నింగికే ఒక అందం
చుక్కలు వేయెందుకు..ఒక్క చంద్రుడే చాలు
చుక్కలు వేయెందుకు..ఒక్క చంద్రుడే చాలు
తనవంశం వెలిగించె..తనయుడొకడె పదివేలు
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
యీ..ఈ..యింటికే యీ..ఈ..యింటికే
కొత్త వెలుగు...వచ్చినరోజూ
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
చరణం::2
కన్నవారి కలలు..తెలుసుకోవాలీ
ఆ కలలు కంటనీరు..పెడితె తుడవాలీ
కన్నవారి కలలు..తెలుసుకోవాలీ
ఆ కలలు కంటనీరు..పెడితె తుడవాలీ
తనకుతాను సుఖపడితే..తప్పుగాకున్నా
తనవారిని సుఖపెడితే..ధన్యత ఓ నాన్నా
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
చరణం::3
తండ్రిమాటకై కానకు..తరలిపోయె రాఘవుడూ
అందుకే ఆ మానవుడు..ఐనాడు దేవుడూ
తల్లి చెరను విడిపించగ..తలపడె ఆ గరుడుడూ
అందుకె ఆ పక్షీంద్రుడు..అంతటి మహానీయుడూ
ఓ బాబూ నువ్వూ...ఆ బాటనడవాలి
ఓ బాబూ నువ్వూ...ఆ బాటనడవాలి
భువిలోన నీ పేరు..ధృవతారగా వెలగాలీ
ధృవతారగా...వెలగాలీ
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
యీ..ఈ..యింటికే యీ..ఈ..యింటికే
కొత్త వెలుగు...వచ్చినరోజూ
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
No comments:
Post a Comment