Monday, December 06, 2010

తాతా మనవడు--1973




సంగీతం::రమేష్ నాయుడు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::L.R. ఈశ్వరి,S.P.బాలు
దర్శకత్వం::దాసరి నారాయణరావు
తారాగణం::S.V.రంగారావు,రాజబాబు,అంజలీదేవి, విజయనిర్మల,సత్యనారాయణ,రమాప్రభ రాజసులోచన.

పల్లవి::
'
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
చీపురుకట్టతో సింగారించి..చీపురుకట్టతో సింగారించి 
దుమ్ముదులుపుతా..దుంపతెంచుతా
దుమ్ముదులుపుతానే..మీ దుంపతెంచుతానే..ఏఏఏఏ 
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

చరణం::1

హేయ్ వొంటిదాన్నిగా సూత్తారా..ఒళ్ళు హూనముగా సేత్తారా
నా నుండేది మడిశారా..ఇంకా ముంగట నిలిశారా
డొక్కసించుతా..ఏయ్..డోలుకట్టుతా..నిలుసోబెట్టి తోలువొలుత్తా  
ఓయ్..డొక్కసించుతా డోలుకట్టుతా..నిలుసోబెట్టి తోలువొలుత్తా  
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

చరణం::2

వరసబెట్టి తింతన్నావే..వోలమ్మ తెగబలిశావె
వరసబెట్టి తింతన్నావే..వోలమ్మ తెగబలిశావె
యీ కొంపకి కోడల్ని..కలకత్తా మాంకాళిని
యీ కొంపకి కోడల్ని..కలకత్తా మాంకాళిని 
వీపు కాసుకోండి..నా దెబ్బ సూసుకోండి
మీ వీపు కాసుకోండి..నా దెబ్బ సూసుకోండి          
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

చరణం::3

ఎవరుచేసిన ఖర్మ వారనుభవింపక..ఎవరికైనా తప్పదమ్మా
అలనాడు శూర్పణఖ..ముక్కు చెవులు పోయి 
అడవిలో పడి...ఏడ్చినమ్మా..ఆఆ    
యీనాడు అటువంటి బ్రహ్మ రాక్షసులకు 
ఎక్కడా చోటులేదమ్మా..ఎక్కడా చోటులేదమ్మా        
ఏయ్..నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
చీపురుకట్టతో సింగారించి..చీపురుకట్టతో సింగారించి 
దుమ్ముదులుపుతా..దుంపతెంచుతా
దుమ్ముదులుపుతానే..మీ దుంపతెంచుతానే 
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

No comments: