Monday, December 06, 2010

తల్లీ కొడుకులు--1973





















సంగీత::G.K.వెంకటేష్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల 

పల్లవి::

నిన్ను మెచ్చాను...నీలో నిజాన్ని మెచ్చానూ
నిన్ను మెచ్చాను...నీలో నిజాన్ని మెచ్చానూ
నన్నిచ్చుకున్నానూ..నీలో సగాన్ని పుచ్చుకున్నానూ 
నన్నిచ్చుకున్నానూ..నీలో సగాన్ని పుచ్చుకున్నానూ
నిన్ను మెచ్చాను...నీలోనిజాన్ని మెచ్చానూ

చరణం::1

చెలిమిగల కళ్ళకన్నా..యిల్లు వేరేమున్నదీ
మమతగల మనసును..మించి కోవెలేమున్నదీ
చెలిమిగల కళ్ళకన్నా..యిల్లు వేరేమున్నదీ
మమతగల మనసును..మించి కోవెలేమున్నదీ
మగసిరిని మించిన...సిరిసంపద
మగసిరిని మించిన..సిరిసంపద మగవారికేముందీ
కన్నెపిల్లకు అంతకన్నా...కానుకేముందీ      
నిన్ను మెచ్చాను..నీలో నిజాన్ని మెచ్చానూ
నన్నిచ్చుకున్నానూ..నీలో సగాన్ని పుచ్చుకున్నానూ 
నిన్ను మెచ్చాను..నీలోనిజాన్ని మెచ్చానూ

చరణం::2

కలిమిగల చిన్నదేమో..వలచి తానొచ్చిందీ
నిలువునా తనకున్నదంతా..దోచుకోమన్నదీ
కలిమిగల చిన్నదేమో..వలచి తానొచ్చిందీ
నిలువునా తనకున్నదంతా..దోచుకోమన్నదీ
నీ వెచ్చ వెచ్చని...కౌగిలింతలో
నీ వెచ్చ వెచ్చని..కౌగిలింతలో దాచుకోమందీ
పడుచువానికి..యింతకన్నా కట్నమేముందీ 
నిన్ను మెచ్చాను..నీలో నిజాన్ని మెచ్చానూ
నన్నిచ్చుకున్నానూ..నీలో సగాన్ని పుచ్చుకున్నానూ 
నిన్ను మెచ్చాను..నీలో నిజాన్ని మెచ్చానూ

No comments: