Saturday, November 22, 2014

శభాష్ వదినా--1972


















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి (sunitha)
తారాగణం::హరనాద్,K.R. విజయ,కృష్ణంరాజు, రాజబాబు,అనిత,రమాప్రభ,మాలతి.

పల్లవి::

వెచ్చ వెచ్చని..నీ ఒడిలో
కమ్మ కమ్మని..కధలెన్నో 
చెప్పుకుందమా..హ్హా..హ్హా
నిన్న మొన్నటి..కలలన్నీ
నేటినుంచీ నిజం..చేసి 
చూసుకుందామా..హో..హా..ఆ       

నిన్న మొన్నటి..కలలన్నీ..ఈ
నేటి నుంచీ నిజం..చేసి..ఈ 
చూసుకుందామా..హా..హా..హా..

చరణం ::1

నీ మాట ఏదో మత్తుజల్లి..మనసునే గమ్మత్తు చేసింది
ఆఆ..నీ చూపు నన్ను చుట్టు ముట్టి సోయగంతో కట్టివేసింది
కన్నెపిల్ల కట్టుబాటు..కౌగిలింతలో సడలిపోయింది
సడలిపోని రాగబంధం చల్లచల్లగ అల్లుకుంటుంది             

వెచ్చ వెచ్చని..నీ ఒడిలో..హ్హా
కమ్మ కమ్మని..కధలెన్నో 
చెప్పుకుందమా..హ్హా..హ్హా
హ్హా..నిన్న మొన్నటి..కలలన్నీ
నేటినుంచీ నిజం..చేసి..ఈ 
చూసుకుందామా..హో..హా..ఆ 

చరణం::2

నీ నీలికురుల వాలుజడలో..మల్లెపూవై వూయలూగాలి
నీ చిలిపినవ్వుల వెన్నెలందు..కలువనై నే పులకరించాలి
పడుచుదనం పందెమెట్టి..వలపుజూదం ఆడుకోవాలి
నాకునువ్వు నీకునేను..రోజురోజూ ఓడిపోవాలి  

హాయ్..వెచ్చ వెచ్చని..నీ ఒడిలో..హ్హా
కమ్మ కమ్మని..కధలెన్నో 
చెప్పుకుందమా..హ్హా..హ్హా
హ్హా..నిన్న మొన్నటి..కలలన్నీ
నేటినుంచీ నిజం..చేసి 
చూసుకుందామా..హో..హో..లాలలాలలా 
హ్హా..హ్హా..లాలలాలలా..

No comments: