సంగీతం::రాజన్-నాగేద్ర
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,వాణిశ్రీ, సావిత్రి,కాంతారావు, సూర్యకాంతం,మిక్కిలినేని, రేలంగి
మారుబిహాగ్::రాగం
(హిందుస్తాని కర్నాటక )
పల్లవి::
మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయ వీణ..తిరిగి పాట పాడునా
మనసులోని మమతల..మాసిపోయి కుములు వేళా
మిగిలింది..ఆవేదనా
మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా
చరణం::1
నిప్పు రగిలి రేగు జ్వాల..నీళ్ల వలన ఆరునూ
నీళ్లలోనే జ్వాల రేగ..మంట ఎటుల ఆరునూ
నీళ్లలోనే జ్వాల రేగ..మంట ఎటుల ఆరునూ
మల్లెతీగ వాడిపోగా..మరల పూలు పూయునా
మనసులోని మమతలన్నీ..మాసిపోయి కుములు వేళా
మిగిలింది..ఆవేదనా
తీగ తెగిన హృదయ వీణ..తిరిగి పాట పాడునా
చరణం::2
కడలిలోన ముసుగు వేళ..పడవ మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ..ఎవరు మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ..ఎవరు మనకు తోడురా
ఆటగాని కోరికేమో..తెలియలేని జీవులం
జీవితాల ఆటలోన..మనమంతా పాపులం
No comments:
Post a Comment