సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, సత్యనారాయణ, గుమ్మడి, శాంతకుమారి, రాజబాబు
పల్లవి::
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల వున్నావంటే..చూడకుండా ప్రాణ ముండదురా..ఆ
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
చరణం::1
కూలికెళ్తే నాకే రారా..చేను వున్నాది
కూడు తింటే నాతో తినరా..తోడువుంటాది
కూలికెళ్తే నాకే రారా..చేను వున్నాది
కూడు తింటే నాతో తినరా..తోడువుంటాది
ఇంకేడకైనా ఎల్లావంటే..ఏఏఏ..ఇంకేడకైనా ఎల్లావంటే
నాది చుప్పనాతి మనసు..అది నీకు తెలుసు
నాది చుప్పనాతి మనసు..అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
చరణం::2
ఊరినిండా వయసు పిల్లలు..ఒంటిగున్నారు
వాటమైనవాడ్ని చూస్తే..వదలనంటారు
ఊరినిండా వయసు పిల్లలు..ఒంటిగున్నారు
వాటమైనవాడ్ని చూస్తే..వదలనంటారు
నీ శపలబుద్ది సూపావంటే..ఏఏఏ..
మనిషి నాకు దక్కవింక..మంచిదాన్ని కాను ఆనక
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
చరణం::3
పగటిపూట పనిలో పడితే..పలకనంటావు
రాతిరేళ రహస్యంగా..రాను జడిసేవు
పగటిపూట పనిలో పడితే..పలకనంటావు
రాతిరేళ రహస్యంగా..రాను జడిసేవు
నే తెల్లవార్లు మేలుకుంటే..నే తెల్లవార్లు మేలుకుంటే
ఎఱ్ఱబడ్డ కళ్ళుచూసి..ఏమేమో అనుకొని
ఎఱ్ఱబడ్డ కళ్ళుచూసి..ఏమేమో అనుకొని
ఈది ఈది..కుళ్ళుకుంటాది
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల వున్నావంటే..చూడకుండా ప్రాణ ముండదురా..ఆ
ఉంటే యీ వూళ్ళో వుండు..పోతే మీ దేశం పోరా
No comments:
Post a Comment