సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P. సుశీల,కౌసల్య
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి
పల్లవి::
ముత్యాల బొమ్మకు..మొగుడొస్తాడే
ఈ మురిపాల..మల్లిని అలరిస్తాడే
చిననాటి చెలులను..చిటికలోన మరపిస్తాడే
ముత్యాల బొమ్మకు..మొగుడొస్తాడే
ఈ మురిపాల మల్లిని..అలరిస్తాడే
చరణం::1
అప్పుడే కనురెప్పలూ అంతబరువై వాలెనే..ఓహో..ఓహో
ఇంతలో నునుసిగ్గులూ దొంతరులుగా ముసిరెనే..ఆహా..ఆహా
అప్పుడే కనురెప్పలూ..అంతబరువై వాలెనే
ఇంతలో నునుసిగ్గులూ..దొంతరులుగా ముసిరెనే
ఎవరమ్మా నీ మొగుడు..ఎలా ఎలా వుంటాడూ
ఎవరమ్మా నీ మొగుడు..ఎలా ఎలా వుంటాడూ
గంధర్వుని తలదన్నే..అందగాడె కాబోలు
ముత్యాల బొమ్మకు..మొగుడొస్తాడే
ఈ మురిపాల మల్లిని..అలరిస్తాడే
చరణం::2
మచ్చలేని చందమామను ఎప్పుడైన చూశారా..ఊహు..ఊహు
మాటలాడే మన్మధుణ్ణి ఎక్కడైనా చూశారా..ఏడీ..ఎక్కడ?
ఆకాశంలో లేడు..ఏ పొదలో కానరాడు
అందరినీ మించినవాడు..నా మదిలో వున్నాడు
ఆతడే..నే..ఏఏఏ..నా విభుడు
No comments:
Post a Comment