Thursday, September 29, 2011

పేదరాశి పెద్దమ్మ కథ--1968::భీమ్ పలాస్::రాగం






















సంగీతం::S.P.కోదండపాణి
రచన::G.విజయరత్నం 
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::కాంతారావు, రాజనాల,రామకృష్ణ, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, రాజసులోచన,
కృష్ణకుమారి,విజయలలిత 

భీమ్ పలాస్::రాగం

పల్లవి:

ఓహో హో ఓ..ఓ జవరాలా..నా సుమబాలా
మదిలో మృగినా..ఆ..మంజుళవీ ణా..ఆ..ఆ..ఆ 
మదిలో మృగినా..ఆ..మంజుళవీణా

ఓహో హో ఓ ఓ..ఓ..నెలరాజ..వెన్నెలరాజా
ఎదలో దాగినా..ఆ..కోవెల రాజా..ఆ
నా ఎదలో దాగినా..ఆ..కోవెలరాజా

చరణం::1

నీ సరి నీవే..నా చెలి రావే
ఈ జగమేలనే..ఏ..నీ మది చాలునే
నీ సరి నీవే..నా చెలి రావే
ఈ జగమేలనే..ఏ..నీ మది చాలునే

విరిసిన ఈ వనమే..స్వాగతమీయగా
విరిసిన ఈ వనమే..స్వాగతమీయగా
జీవనజ్యోతి నే..నీ జత చేరనా..ఆ
జీవనజ్యోతి నే..నీ జత చేరనా

ఓహో హో ఓ..ఓ జవరాలా..నా సుమబాలా
ఎదలో దాగినా..ఆ..కోవెల రాజా..ఆ
నా ఎదలో దాగినా..ఆ..కోవెలరాజా

చరణం::2

తారకలన్నీ..దీవనలీయగా
మనసే హాయిగా..ఊయలలూగెనే
తారకలన్నీ..దీవనలీయగా
మనసే హాయిగా..ఊయలలూగెనే
శుభమని పూలతలే..హారతులీయగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శుభమని పూలతలే..హారతులీయగా
కోయిల పాడెనే..మంగళ గీతిక..ఆ
కోయిల పాడెనే..మంగళ గీతిక

ఓహో హో ఓ..ఓ జవరాలా..నా సుమబాలా
మదిలో మృగినా..ఆ..మంజుళవీ ణా..ఆ
మదిలో మృగినా..ఆ..మంజుళవీణా

No comments: