ఈ పాట చిమ్మట మ్యుజిక్ ఖజానాలో వినండి
సంగీతం::సత్యం
రచన::దాసరి నారాయణ రావు
గానం::బాలు
అంకితం నీకే అంకితం
అంకితం నీకే అంకితం
అంకితం నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం నీకే అంకితం
ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా...
కాళిదాస కలమందు చిందు అపురూప దివ్య కవిత
త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ధసార నవత
నవ వసంత శోభనామయూఖ
లలిత లలిత రాగ చంద్రలేఖ
స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుందీ
మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుందీ
స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుందీ
మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుందీ
ఆ అనురాగం ఒక ఆలయమైతే..ఆ ఆలయ దేవత నీవైతే
ఆ ఆలయ దేవత నీవైతే
గానం..గాత్రం..గీతం..భావం..సర్వం అంకితం
అంకితం..నీకే అంకితం...
లోకవినుత జయదేవ శ్లోక శ్రంగార రాగ ద్వీప
భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప
స్వర విలాస హాస చతుర నయన
సుమ వికాస భాస సుందర వదన
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుందీ
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుందీ
ఆ ప్రణయం ఒక గోపురమైతే..ఆ గోపుర కలశం నీవైతే ..ఆ గోపుర కలశం నీవైతే
పుష్పం..పత్రం...ధూపం..దీపం..సర్వం అంకితం...
అంకితం నీకే అంకితం
అంకితం నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం నీకే అంకితం
ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా...
No comments:
Post a Comment