సంగీతం::S.P.కోదండపాణి
రచన::చిల్లర భావనారాయణరావు
గానం::బాలమురళీ కృష్ణ గారు
పల్లవి::
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
శివ మనోరంజని..ఈ..వరపాణీ సర్వరాణీ
కనవే జననీ కృప బూనీ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
శివ మనోరంజని..ఈ..వరపాణీ సర్వరాణీ
కనవే జననీ కృప బూనీ
చరణం::1
కవికే కనరాని కాంతివి నీవై
కవికే కనరాని కాంతివి నీవై
శ్రుతిలో లయగా సాగే సతివై
శ్రుతిలో లయగా సాగే సతివై
అభినయ శిల్పాల అలరే కళవై
అభినయ శిల్పాల అలరే కళవై
సరస రసిక జన హృదయ కమలముల
వెలుగు కిరణముగ తళుకులొలికితివి
శివ మనోరంజని..ఈ..
చరణం::2
మెరసే జలదాల మేదుర నాదం..మ్మ్ మ్మ్
ఆఆ ఆఆ ఆఆ ఆఆఆఆ
మెరసే జలదాల మేదుర నాదం
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
మెరసే జలదాల మేదుర నాదం
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
సలలిత గాంధర్వ వరగానమునా
సలలిత గాంధర్వ వరగానమునా
రజితగిరి శిఖరి చలన
చరణ ఝణ ఝణిత ప్రణవ
నటనముల సలుపుమిట
శివ మనోరంజని..శివ మనోరంజని
శివ మనోరంజని..ఈ...
No comments:
Post a Comment