సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, P.సుశీల
పల్లవి::
ఇదియే అందాల మానవ సీమా ఆ..ఆ..ఆ..ఆ
ఇలయే ప్రేమికుల మురిపాల సీమ..ఆ..ఆ..ఆ..ఆ
ఇదియే లావణ్య జీవన మహిమ..ఆ..ఆ..ఆ..ఆ
ఇచటే పండునులే ఎనలేని ప్రేమా..ఆ..ఆ
ఇదియే లావణ్య జీవన మహిమా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చరణం::1
విరిసే సొగసులతో..నిదురించే సెలయేరూ
సెలయేటి తిన్నెలపై..పులకించే హృదయాలు
విరిసే సొగసులతో..నిదురించే సెలయేరూ
సెలయేటి తిన్నెలపై..పులకించే హృదయాలు
శిలలైనా వలపులతో చిగురించే కోన
శిలలైనా వలపులతో చిగురించే కోన
కమనీయం రమణీయం..కమ్మని జీవనా
కమనీయం రమణీయం..కమ్మని జీవనా
ఇదియే అందాల మానవ సీమ ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఇచటే పండునులే ఎనలేని ప్రేమా..ఆ..ఆ
ఇదియే లావణ్య జీవన మహిమ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చరణం::2
ఆశలు హంసలై విహరించే దీవీ
అలలాగా పడిలేచే అందాల తనివి
ఆశలు హంసలై విహరించే దీవీ
అలలాగా పడిలేచే అందాల తనివి
పైరగాలి కెరటాల పయనించే గీతం
పైరగాలి కెరటాల పయనించే గీతం
ఎదవుంటే భూలోకం ఎంతో మోహనం
ఎదవుంటే భూలోకం ఎంతో మోహనం
ఇదియే అందాల మానవ సీమ ఆ..ఆ
ఆ..ఆ..ఇచటే పండునులే ఎనలేని ప్రేమ..ఆ
ఇదియే అందాల మానవ సీమ ఆ..ఆ..ఆ
No comments:
Post a Comment