Monday, August 01, 2011

శ్రీనివాస కళ్యాణం--1987

సంగీతం::K.V. మహాదేవన్
రచన::వేటూరి 
గానం::S.P.బాలు , S.జానకి

పల్లవి::

ఆహా..ఆఆఆ..ఆహాఆఆఆఆ 
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం 
తొలిపొద్దుల్లో హిదోళం..మలిపొద్దుల్లో భూపాళం
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం 
తొలిపొద్దుల్లో హిదోళం..మలిపొద్దుల్లో భూపాళం

నేనుగా మారిన నీకోసం..నీడైపోయిన నా ప్రాణం 
నీకే అంకితం నీదే జీవితం..నీకే అంకితం నీదే జీవితం 
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం

చరణం::1

పచ్చని దేవత..పలికే చోట 
కుంకుమ పువ్వులు..చిలికే చోట 
తెల్లని మబ్బులు..కురిసే చోటా..ఆ
లోకపు హద్దులు..ముగిసే చోటా 

రెండవ చెవినే పడకుండా..మాట ఇచ్చుకుంటా 
మూడోకంట పడకుండా..ముద్దు ఇచ్చుకుంటా 
రెండవ చెవినే పడకుండా..మాట ఇచ్చుకుంటా 
మూడోకంట పడకుండా..ముద్దు ఇచ్చుకుంటా 

నేనుగా మారిన నీకోసం..నీడైపోయిన నాప్రాణం 
నీకే అంకితం నీదే జీవితం 
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం

చరణం::2

కాలం కదలక..నిలిచే చోటా 
కడలే అలలను..మరిచే చోట 
రాతిరి ఎండలు..కాసే చోటా..ఆ 
ప్రేమలు కన్నులు..తెరిచే చోటా

ఆమని కోయిల వినకుండా..పాటలల్లుకుంట 
వెన్నెల పూవుల పొదరింట..నిన్ను అల్లుకుంట 
ఆమని కోయిల వినకుండా..పాటలల్లుకుంట
వెన్నెల పూవుల పొదరింట..నిన్ను అల్లుకుంట

నేనుగా మారిన నీకోసం..నీడైపోయిన నాప్రాణం 
నీకే అంకితం నీదే జీవితం 
తొలిపొద్దుల్లో హిందోళం..మలి పొద్దుల్లో భూపాళం
తొలిపొద్దుల్లో హిందోళం..మలిపొద్దుల్లో భూపాళం

No comments: