సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీరసాగర మథనం
మింగినాను హలాహలం...
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
పేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళని ఈ ఎదలో ముళ్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
నే నోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటినే మరిచేపోయి
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీరసాగర మథనం
మింగినాను హలాహలం...
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
2 comments:
శక్తి, రెండవ చరణం మూడవ పంక్తిలో "అపుడాగాలి ఈ మూగ గానం" అని ఉండాలి.
నమస్తే సూర్యనారాయణగారు __/\__
బహుకాలదర్శనం :)
మీకు ఏమి రుణము ఉన్నానో తెలియటంలేదు?
నా పాటల లోటుపాట్లు మీరే చూస్తున్నారు
చాలా చాలా థాంక్స్ అండీ
నాకో చిన్న సహాయం కావాలి!!
మహిషాసుర మర్ధిని స్తోత్రం కావాలి
నా డివోషనల్ బ్లాగులో ఉంది కాని చాలా
తప్పులు ఉన్నాయి :((
దయచేసి మీకు తెలిస్తే చెప్పగలరు !
Post a Comment