Monday, August 01, 2011

అభినందన--1988


సంగీతం::ఇళయరాజా
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి


మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..ఓ..ఓ..

నీవు పిలిచే పిలుపులో..జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో..జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో..తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో..తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో..ఏమిటా సొంపులో

మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..ఓ..ఓ..

మొలకసిగ్గు బుగ్గలో..మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో..మొదటి ముద్దు ఎప్పుడో
మన్మదునితో జన్మవైరం సాగినపుదో
ఆరిపోని తాపము..అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము..అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో..ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో..ఓ..ఓ..

No comments: