సంగీతం::ఇళయరాజా
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
కీరవాణి రాగం
ఎదుటా నీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు..నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే
మరుపే తెలియని నా హృదయం..తెలిసి వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం..తెలిసి వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
గాయన్నైనా మాననీవు..హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు..మరణం నన్ను చేరనీదు
పిచ్చివాడ్ని కానీదు
అహహ ఒహొహొ ఉహుహుహు
ఎదుటా నీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు..నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే..ఎదలోనా నీవే
కలలకు బయపడి పోయాను..నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు బయపడి పోయాను..నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలన్ని క్షణికాలేగా..సత్యాలన్ని నరకాలేగా
స్వప్నం సత్యమయితే వింత..సత్యం స్వప్నమయ్యెదుందా
ప్రేమకింత బలముందా
అహహ ఒహొహొ ఉహుహుహు
ఎదుటా నీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు..నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే..ఎదలోనా నీవే
No comments:
Post a Comment